బాలీవుడ్ విలన్ ని ఎంకరేజ్ చేస్తున్న టాలీవుడ్Tollywood
2020-02-21 18:55:03

టాలీవుడ్ లో పక్క భాషల నుంచి హీరోయిన్లని దిగుమతి చేస్తారో విలన్స్ ని కూడా అలాగే దిగుమతి చేస్తుంటారు. ఒక్క సినిమాలో తన టాలెంట్ నిరూపించుకుంటే వారికి వరుస ఆఫర్స్ వస్తాయి. ఈ కోవలో షియాజీ షిండే, రాహుల్ దేవ్, ముఖేష్ రిషి లాంటి వాళ్లు ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు బెంగాలీ ఆర్టిస్ట్ జిషూ సేన్ గుప్తాకి ఇప్పుడు వరుస అవకాశాలు వస్తున్నాయి. అశ్వద్ధామ సినిమాలో సైకోగా నటించిన జిషు, అమ్మాయిలను భయపెట్టి ఇప్పుడు భీష్మ సినిమాలో సంప్రదాయ వంటలను నాశనం చేసే కార్పొరేట్ శక్తిగా నటించాడు. 

ఈరోజే ఈ సినిమా జనాల ముందుకు వస్తోంది. ఇక ఈ సినిమా కూడా హిట్ కొట్టేస్తే త్వరలోనే జిషు టాలీవుడ్ లో స్టార్ విలన్ గా మారే అవకాశముందని చెప్పొచ్చు.  ఇక ఆయన తాజాగా 'తలైవి' లాంటి సినిమాలో మంచి ఛాన్స్ అందుకున్నాడు. ఈ సినిమాలో అతను కీలకమైన పాత్ర చేస్తున్నాడు. జయలలిత జీవిత కథతో తెరకెక్కతున్న ఈ సినిమాలో జిష్ణు శోభన్ బాబుగా కనిపించబోతున్నారు. 

More Related Stories