కరోనా సమయంలో కూడా అదొక్కటే ఊరట..coronavirus
2020-04-09 08:24:56

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దెబ్బకు అంతా ఇంటికి పరిమితం అయిపోయారు. ఎప్పుడూ బయట షూటింగ్స్ అంటూ తిరిగే స్టార్స్ కూడా ఇళ్లలోనే ఉంటూ.. అందర్నీ ఇంట్లోనే ఉండాలని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ కరోనా కారణంగా సినిమాలు అయితే ఆగిపోయాయి.. దాంతోపాటే షూటింగ్స్ కూడా ఆగిపోయాయి. కానీ కొందరు మాత్రం ఇప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. దాంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. లాక్ డౌన్ కారణంగా బయటికి వెళ్లొద్దన్నారు కానీ ఇంట్లో ఉండి పనులు చేసుకోవద్దని ఎవరూ చెప్పలేదు. మన హీరోలు కూడా ఇప్పుడు ఇదే చేస్తున్నారు. హాయిగా ఇంట్లోనే ఉంటూ తమ కొత్త సినిమాల అప్ డేట్స్ ఇస్తున్నారు. మొన్నటికి మొన్న ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ తో పాటు రామ్ చరణ్ టీజర్ కూడా వచ్చింది. దాంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమా ఫస్ట్ లుక్ తో వచ్చాడు. ఇది కూడా నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ అవుతుంది. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి అయితే ఇంట్లోనే కూర్చుని ట్విట్టర్ లో అల్లాడిస్తున్నాడు. మొత్తానికి కరోనా సమయంలో కూడా స్టార్ హీరోలంతా ఇలా సందడి చేయడం ఒక్కటే అభిమానులకు ఊరట.

More Related Stories