త్రిముఖ పోటీలో విజయం ఎవరిదో..  శివరాత్రి ఫైట్..



shiva ratri 2021
2021-03-10 12:56:48

నిజం చెప్పాలంటే ఉప్పెన సినిమా తర్వాత బాక్సాఫీస్ దగ్గర మళ్లీ ఆ రేంజ్ లో సందడి కనిపించలేదు. మధ్యలో అల్లరి నరేష్ నటించిన నాంది ఒకటే విజయం సాధించింది. భారీ అంచనాలతో వచ్చిన కొన్ని సినిమాలు దారుణంగా నిరాశ పరిచాయి. అందులో నితిన్ చెక్ సినిమా కూడా ఉంది. ప్రతివారం దాదాపు పది సినిమాలు విడుదలవుతున్నా.. ఒక్కటంటే ఒక్కటి కూడా విజయం సాధించకపోవడం దర్శక నిర్మాతలను కలవరపెడుతోంది. పెరుగుతున్న కరోనా కేసులు కలెక్షన్లపై ప్రభావం చూపిస్తున్నాయా అని వారు భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో శివరాత్రి సందర్భంగా విడుదలవుతున్న మూడు భారీ సినిమాలు నిర్మాతలలో ఆశలు పెంచుతున్నాయి. 

ముఖ్యంగా ఈ మూడు సినిమాలపై ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అందులో శర్వానంద్ శ్రీకారం, నవీన్ పోలిశెట్టి జాతిరత్నాలు, శ్రీ విష్ణు గాలి సంపత్ సినిమాలు ఉన్నాయి. వీటిలో జాతి రత్నాలు మంచి హైప్ తో వస్తుంది. ప్రమోషన్లలో కూడా ఈ సినిమా అందరికంటే ముందుంది. ముఖ్యంగా నవీన్ పొలిశెట్టి తన మార్కు ప్రమోషన్స్ తో ఈ సినిమాపై అంచనాలు పెంచేశాడు. మరోవైపు శ్రీకారం కోసం చిరంజీవి, రామ్ చరణ్ సహా ఇండస్ట్రీలో చాలామంది ముందుకొచ్చారు. ఇక గాలి సంపత్ సినిమాపై అంచనాలు తక్కువగా ఉన్నట్టు కనిపిస్తున్నా.. దీని వెనక అనిల్ రావిపూడి ఉన్నాడు. ఒక బ్రాండ్ చాలు సినిమాకు కలెక్షన్లు రావడానికి. ఏదేమైనా ఈ వారం మూడు క్రేజీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్నాయి. మరి వీటిలో ఏది ప్రేక్షకుల మెప్పు పొందుతుందో చూడాలి.

More Related Stories