దసరా వదిలేద్దాం.. సంక్రాంతికి చూసుకుందాం..Tollywood
2020-10-13 20:12:54

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. అక్టోబర్ 15 నుంచి థియేటర్ ఓపెన్ చేసుకోవాలని కేంద్రం సూచించిన కూడా అటువైపుగా నిర్మాతలు ఎవరూ ఆలోచించడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా విడుదల చేస్తే నష్టాలు వస్తాయి. పైగా 50% టికెట్స్ అమ్ముకుంటే ఏ నిర్మాత కూడా ఒప్పుకోడు. పెట్టిన బడ్జెట్ సగం కూడా రాదు. ఒకవేళ సినిమా బాగోలేకపోతే పూర్తిగా నష్టపోతాడు. ఇవన్నీ అర్థం చేసుకొని అక్టోబర్ 15 తర్వాత సినిమాలు విడుదల చేయడానికి ఎవరూ ఒప్పుకోవడం లేదు.. ముందుకు రావడం లేదు. ఇప్పటికే విడుదలైన కొన్ని పాత సినిమాలను 15 తర్వాత మరోసారి విడుదల చేస్తున్నారు. ఇవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనేది కూడా అనుమానమే. నరేంద్ర మోడీ బయోపిక్ 2019 మే 24న విడుదలై ఫ్లాప్ అయ్యింది.

ఇదే సినిమాను అక్టోబర్ 15న మళ్లీ విడుదల చేస్తున్నారు. కానీ తెలుగులో మాత్రం అలాంటి ప్రయోగాలు ఎవరూ చేయడం లేదు. దసరా, దీపావళి సీజన్స్ కళ్ళముందు కనిపిస్తున్న కూడా దర్శకనిర్మాతలు వదిలేస్తున్నారు. బంగారం లాంటి సీజన్ అయినా కూడా కరోనా వైరస్ కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు రారు అని ఫిక్స్ అయిపోయారు నిర్మాతలు. అందుకే దసరా, దీపావళి, క్రిస్మస్ మూడు సీజన్స్ వదిలేసి సంక్రాంతికి చూసుకుందాం అనుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం చూసుకుంటే సంక్రాంతికి నితిన్ రంగ్ దే, సాయి ధరంతేజ్ సోలో బ్రతుకే సో బెటరూ.. మరో రెండు మూడు సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వాటికి వచ్చే కలెక్షన్లను బట్టి మిగిలిన సినిమాల విడుదల చేయాలా వద్దా అని నిర్ణయించుకోనున్నారు నిర్మాతలు. ఏదేమైనా కూడా 2020 సినిమా ఇండస్ట్రీకి తీరని నష్టాలు తీసుకొచ్చింది. గత ఆరు నెలలుగా సినిమా ఇండస్ట్రీ దాదాపు 12 వేల కోట్లు నష్టపోయిందని ఒక అంచనా. 

More Related Stories