డ్రంకెన్ డ్రైవ్ లో దొరికిపోయిన నిర్మాత కుమారుడుdrunk
2019-07-07 10:15:38

హైదరాబాద్ నగరంలో గత రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ తనిఖీల్లో టాలీవుడ్ సినీ నిర్మాత కొడుకు ఒకరు అడ్డంగా దొరికిపోయాడు. జూబ్లీహిల్స్‌లో రోడ్ నంబరు 10లో నిన్న రాత్రి నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో ఈ నిర్మాత కుమారుడు పట్టుబడ్డాడు. ప్రతి వీకెండ్ లో చేసే లానే నిన్న రాత్రి కూడా తనిఖీల్లో భాగంగా ఓ కారును ఆపిన పోలీసులు దానిని నడుపుతున్న యువకుడికి బ్రీత్ అనలైజర్ తో పరీక్షలు చేసేందుకు ట్రై చేయగా అందుకు నిరాకరించిన ఆ యువకుడు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. కారు దిగి కిందకు వచ్చిన ఆ యువకుడు నానా హంగామా చేశాడు. తాను ప్రముఖుడి కుమారుడినంటూ పోలీసులతో వాగ్వివాదానికి దిగాడు. దీంతో అక్కడే ఉన్న జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకుని అతడికి బ్రీత్ టెస్ట్ నిర్వహించారు. పరీక్షలో అతడు మద్యం తాగినట్టు తేలింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతను నడుపుతున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ యువకుడు వెంటనే  లోకల్ ప్రజాప్రతినిధికి ఫోన్ చేయగా ఆయన పోలీసులకు ఫోన్ చేసి సీజ్ చేఇన కారును వదిలిపెట్టాలని ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. అయితే వదిలిపెట్టని పోలీసులు కారుని స్థానిక ట్రాఫిక్ స్టేషన్ కి తరలించారు. ఇక ఈ తనిఖీల్లో 12 ద్విచక్రవాహనాలు, 5 కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఈఈ యజమానులకి కౌన్సెలింగ్‌ నిర్వహించి ఆ తర్వాత కోర్టులో హాజరుపరుస్తారు.

More Related Stories