డిసెంబర్ వరకు నో షూటింగ్.. సూపర్ స్టార్ అల్టిమేటం..tollywood
2020-06-13 14:46:31

కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే వణికిపోతున్నారు ప్రజలు. ఏదైనా పని ఉండి బయటకు వెళ్ళిన వాళ్ళు కరోనా వైరస్ లేకుండా ఇంటికి వస్తే అదే పదివేలు అని సంతోషిస్తున్నారు కుటుంబ సభ్యులు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా షూటింగులకు అనుమతి వచ్చినా కూడా మన దర్శక నిర్మాతలకు ధైర్యం సరిపోవడం లేదు. షూటింగ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఒకే చోట చాలామంది గుమిగూడి ఉంటారు. ఎన్ని నియమ నిబంధనలు పాటించినా కూడా ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా జరిగే నష్టం మాత్రం భారీగానే ఉంటుంది. పైగా హీరో హీరోయిన్లతో పాటు దర్శక నిర్మాతలు, జూనియర్ ఆర్టిస్టులు ఇలా చాలా మంది తతంగం ఉంటుంది. ఇవన్నీ తెలిసిన ఒక తెలుగు సూపర్ స్టార్ మరో ఆరు నెలల వరకు షూటింగ్ కు రాను అంటూ దర్శక నిర్మాతలకు చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ మధ్య కొత్త సినిమా అనౌన్స్ చేసి దాని బిజీలో ఉన్న ఈ హీరో గారు ప్రస్తుతం పరిస్థితి చూసి షూటింగుకు రాలేరు అని తెగేసి చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. మీరు ఏమైనా అనుకోండి మరో నాలుగైదు నెలలు నేను ఇంట్లోనే ఉంటాను అని నిర్మాతలకు, ఆ దర్శకుడికి సూపర్ స్టార్ సర్ది చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ మీకు అంతగా షూటింగ్ చేసుకోవాలి అనుకుంటే నేను లేని సన్నివేశాలు ఇప్పుడే చిత్రీకరించండి అంటూ ఆయన ఉచిత సలహా కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బయట పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి కాబట్టి మీరు కూడా కొన్ని రోజులు ఇంట్లోనే ఉండండి అంటూ ఆయన చెప్పినట్లు తెలుస్తుంది. డిసెంబర్ లో షూటింగ్ మొదలు పెట్టి నాన్ స్టాప్ షెడ్యూల్తో పూర్తి చేద్దామని ఆయన హామీ ఇచ్చాడని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా నేడో రేపో షూటింగ్ మొదలు పెడదాం అని కలలు కంటున్న దర్శకుడికి ఆ సూపర్ స్టార్ మామూలు షాక్ ఇవ్వలేదు. పైగా రెండేళ్ల నుంచి ఆయన ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇప్పుడు ఈ స్టార్ హీరో మాటలతో దర్శకుడు మరోసారి డైలమాలో పడిపోయాడు.

More Related Stories