త్రిష అలా  కన్ఫాం చేసేసింది Trisha
2019-12-15 17:07:20

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న‌ సంగతి తెలిసిందే. మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్‌గా తెర‌కెక్క‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవ‌ల దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలు జ‌రుపుకున్న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. ఇందులో దేవాదాయ ధ‌ర్మాదాయ శాఖ ఉద్యోగిగా చిరు క‌నిపించ‌నున్నార‌ని, వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంద‌ని ప్రచారం. ఈ చిత్రంలో చిరంజీవి సరసన నటించే హీరోయిన్ల కోసం కొరటాల శివ పెద్ద కసరత్తే చేస్తున్నాడు. అనుష్క, శృతి హాసన్, త్రిష లాంటి హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్న కొరటాల మాత్రం ఇంకా ఎటువంటి క్లారిటీ ఇవ్వ లేదు. ఈ సినిమాలో త్రిష దాదాపు ఖరారైనట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని త్రిష ఖరారు చేసింది.  ఈ ఏడాది త్రిష మూడు సినిమాలతో అలరించబోతున్నారంటూ ట్వీట్‌ చేశారు రమేష్ బాల. మణిరత్నంతో ‘పొన్నియిన్‌ సెల్వన్‌’, మోహన్‌లాల్‌తో ఓ సినిమా, చిరంజీవి-కొరటాల శివ సినిమాలో ఆమె నటించబోతున్నారంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ చూసిన త్రిష స్పందిస్తూ నిజమే అన్నట్లుగా విక్టరీ సింబల్‌తో పాటు #2020 ట్యాగ్‌ను జత చేశారు. దీంతో చిరు చిత్రంలో హీరోయిన్‌గా త్రిష అని నెటిజన్లు నిర్ధారించుకున్నారు.  

More Related Stories