మాజీ లవర్ అంటూ పోస్ట్ చేసి డిలీట్ చేసిన త్రిషTrisha
2020-05-27 23:41:35

కొన్నేళ్ళ క్రితం సింగర్ సుచిత్ర ట్విట్టర్ లీక్స్ వ్యవహారం కోలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పడు రానా తన్మయత్వంతో తమిళ బ్యూటీ త్రిష బుగ్గని ముద్దాడుతున్న ఫోటో తెగ హల్చల్ చేసింది. కేవలం సరదాకి ఫోటో తీయించుకోవడం వేరు. ఈ ఫోటో వేరు. వారిద్దరి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందొ, త్రిషని రానా ఎంత తన్మయంతో ముద్దాడాడో ఆ ఫోటో చూస్తే అర్ధమైపోతుంది. అదే సమయంలో క్రితం త్రిష-రానాల వ్యవహారం పెళ్లి దాకా వచ్చేసినంత హడావుడి జరిగింది. మరో పక్క కానీ త్రిషకు వేరే ఎంగేజ్మెంట్ కాన్సిల్ క్కూడా అయ్యింది. అప్పటి సంగతిని ఎవరూ ఖండించకపోయినా ఆ విషయం మరుగున పడింది. ఇక మొన్నటికి మొన్న రానా ప్రేమ-పెళ్లి అంటూ ఒక అమ్మాయిని పరిచయం చేయడం కూడా మనకి తెలుసు. 

అయితే ఈ నేపధ్యంలో త్రిష తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక పోస్ట్ వేసి డిలీట్ చేసిన వైనం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆమె త‌న పోస్ట్‌ లో "నాకు తెలుసు. ఎవ‌రైతే త‌మ మాజీ ప్రియురాళ్ళని స్నేహితులిగా అభివ‌ర్ణిస్తారో, వారు అహంకారులుగా మిగిలిపోతార‌ని రాసుకొచ్చింది. అయితే ఏమయిందో ఏమో కానీ కొద్ది సేపటికే ఆ పోస్ట్ ను ఆమె డిలీట్ చేసింది. కానీ అప్పటికే ఆమె పోస్ట్ చేసిన దానిని స్క్రీన్ షాట్స్ ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌ని చూసిన నెటిజ‌న్స్‌.. రానా గురించే త్రిష ఇలా పోస్ట్ పెట్టి ఉంటుంద‌ని భావిస్తున్నారు. మిహికా బజాజ్‌తో రానా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా త్రిష చేసిన పోస్ట్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  

More Related Stories