కీర్తి సురేశ్ పెంగ్విన్ కి స్టార్ హీరోయిన్స్ అండKeerthy Penguin
2020-06-08 07:39:11

మహాన‌టి తో జాతీయ అవార్డ్ అందుకున్న కీర్తి సురేశ్ నటించిన సినిమా పెంగ్విన్. ప్యాన్ ఇండియన్ సినిమాగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. దీనిని ఎక్స్ క్లూజివ్ గా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 19న విడుద‌ల చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో పెంగ్విన్ టీజ‌ర్ ని జూన్ 8న విడుద‌ల చేయ‌డానికి ఆమెజాన్ టీమ్ ప్లాన్ చేసింది. ఈ టీజ‌ర్ ను తెలుగు, మ‌ళ‌యాల‌, త‌మిళ భాష‌ల్లో ఒకే సారి విడుద‌ల చేయ‌బోతున్నారు. అది కూడా ఆయా బాషలలో స్టార్ హీరోయిన్లుగా ఉన్న తాప్సీ ప‌న్ను, స‌మంత‌, మంజు వారియ‌ర్, త్రిషలచే ఈ టీజ‌ర్ ని జూన్ 8న వారి వారి ట్విట్టర్ ఖాతాలు ద్వారా విడుద‌ల చేస్తున్న‌ట్లుగా అమెజాన్ ప్రైమ్ వీడియో టీమ్ అధికారికంగా నిన్న ఒక ప్రకటన విడుదల చేసింది. 

దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు నిర్మించిన ఈ సినిమాని ఈశ్వ‌ర్ కార్తీక్ తెరకెక్కించారు.  అయితే ఇప్పట్లో థియేటర్ రిలీజ్ కుదిరే పని కాదని భావించి పెంగ్విన్ సినిమాని అమెజాన్ ప్రైమ్ వీడియోకి అమ్మేశారు. దీంతో ఈ సినిమా నేరుగా అమెజాన్ ప్రైమ్ లోనే విడుద‌ల కానుంది. అలాగే అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్న తొలి తెలుగు సినిమా పెంగ్విన్ కావడం విశేషం. పెంగ్విన్‌ సినిమాలో కీర్తి ఓ ప్రయోగాత్మక పాత్రను పోషించబోతున్నట్లు అప్పట్లో రిలీజ్ చేసిన పోస్టర్‌ ద్వారా క్లారిటీ వచ్చింది. గతేడాది అక్టోబర్ లో విడుదలైన ఈ పోస్టర్ లో కీర్తి డార్క్‌ షేడ్‌లో గర్భవతిగా ఉన్నట్టుగా దర్శనమిచ్చింది. బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో ఆమె రూపం పెంగ్విన్ పక్షిలా ఉంది.  

More Related Stories