త్రివిక్రమ్ బడా డీల్...కొత్త కుర్రోడితో సినిమా.. trivikram
2020-04-07 20:02:35

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లలో త్రివిక్రమ్ ఒకరు. ఆయనతో సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు. స్టార్ హీరోలకి మాత్రమె అది సాధ్యం. ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకి అయిననూ పోయి రావలె హస్తినకు అనే టైటిల్ కూడా అనుకుంటున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులతో త్రివిక్రమ్ బిజీగా వున్నాడు. 

అయితే ఈ సినిమా తరువాత చిరంజీవితో ఒక సినిమా చేయాల్సి ఉన్నా త్రివిక్రమ్ మరో ప్రాజెక్టు లైన్లో పెట్టినట్టుగా ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ద్వారా ఆయన ఒక కొత్త హీరోను పరిచయం చేయనున్నట్టు ప్రచారం సాగుతోంది. కొన్నిరోజుల క్రితం త్రివిక్రమ్ ఒక బడా బిజినెస్ మెన్ తో ఒక డీల్ చేసుకున్నట్టు చెబుతున్నారు. తెలుగులో ఆ వ్యాపారవేత్త కుమారుడిని హీరోగా ఇంట్రడ్యూస్ చేసే బాధ్యత తీసుకున్న త్రివిక్రమ్ భారీ పారితోషకం కూడా అందుకోనున్నాదట. 

నిజానికి ఇప్పటి దాకా త్రివిక్రమ్ చినబాబుకు చెందినా ప్రొడక్షన్ హరికా హాసిని బ్యానర్, లేదా సితారలొనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. మొన్న కూడా బలవంతంగా అల్లు అర్జున్ అల వైకున్తపురములో కలిశాడని టాక్ ఉంది. ఇక ఈ కొత్త హీరో కోసం 170 కోట్ల బడ్జెట్ తో ఒక కధ పూర్తి చేశాడట. ఈ సినిమాకి గాను త్రివిక్రమ్ కి దాదాపు 35కోట్లకు పైగా రెమ్యునరేషన్ దక్కే ఛాన్స్ ఉన్నట్లు టాక్. అయితే ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. 
 

More Related Stories