కరోనా నుంచి కోలుకున్న త్రివిక్రమ్



Trivikram Srinivas
2021-04-10 16:51:27

టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్  కరోనాను జయించారు. ఆయనకు కొవిడ్-19 నెగిటివ్ వచ్చింది. కొన్ని రోజుల క్రితం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. ఆయన సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉంటూ చికిత్సను పొందుతున్నారు. దీనిపై అధికారికంగా ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు.  లేటెస్ట్ గా  మళ్లీ కొవిడ్ టెస్ట్ చేశారు. ఈ టెస్ట్‌లో ఆయనకు కొవిడ్-19 నెగిటివ్ అని తేలింది.

ప్రస్తుతం త్రివిక్రమ్  యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయ‌డానికి ఓకే చెప్పేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాదిలోనూ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌డానికి రంగం సిద్ధ‌మ‌వుతుంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అర‌వింద‌స‌మేత వీరరాఘ‌వ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్ర‌మిది. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, హారిక అండ్ హాసిన క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా రూపొంద‌నుంది. గ‌త ఏడాది అల వైకుంఠ‌పుర‌ములో సినిమాతో నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను క్రియేట్ చేసిన త‌ర్వాత త్రివిక్ర‌మ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది.
 

More Related Stories