అన్న కోసం ఎన్టీఆర్ ప్లాన్...నెక్స్ట్ సినిమా అలా ప్లాన్ చేశాడట NTR kalyan Ram
2020-01-16 21:11:58

ప్రస్తుతం నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ఆయన దాదాపు యేడాదన్నర పాటు డేట్స్ కేటాయించాడు. అయితే అనుకున్న దాని ప్రకారం అయితే ఈ సినిమా 2020 జూలై 30న విడుదల కావాల్సి ఉంది. అయితే కొంచెం గ్రాఫిక్స్ వర్క్ వలన లేట్ కూడా అవ్వచ్చు చెప్పలేము. అయితే సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన షూటింగ్ ఫిబ్రవరికి పూర్తి కానుంది. 

ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడని అంటున్నారు. ఆల్రెడీ ఈ సంక్రాంతికి అల్లు అర్జున్‌తో చేసిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో మంచి హిట్టే అందుకున్న త్రివిక్రమ్ ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌తో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నట్టు సమాచారం. అయితే ఎన్టీఆర్ మొన్న విడుదలైన అల వైకుంఠపురంలో సినిమా సక్సెస్ నేపథ్యంలో దర్శకుడు మరియు హీరోలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశాడు. ఆ విషెష్ చూస్తుంటే ఎన్టీఆర్ తదుపరి చిత్రం ఖచ్చితంగా త్రివిక్రమ్ తోనే అనిపించేలా ఉంది. 

నిజానికి చాలా కాలంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలన్నీ కూడా సూర్యదేవర చినబాబు నిర్మిస్తున్నాడు. హాసిని అండ్ హారిక బ్యానర్ ను ప్రారంభించిన ఆయన ఆ బ్యానర్ లో కేవలం త్రివిక్రమ్ తో మాత్రమే సినిమాలు నిర్మిస్తున్నాడు. వేరే డైరెక్టర్స్ అలాగే హీరోల కోసం సితార కొడుకుతో రన్ చేయిస్తున్నారు. 

ఇక ఇటీవల అల వైకుంఠపురంలో సినిమాకు బన్నీ సొంత బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ నిర్మాణ భాగస్వామి అయ్యింది. అల్లు అరవింద్ బలవంతంగా ఈ నిర్మాణంలో జాయిన్ అయ్యాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇప్పుడు వచ్చే సినిమాతో తన అన్న కళ్యాణ్ రామ్ ను భాగస్వామిగా మార్చాలని ఎన్టీఆర్ కోరినట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే తన అన్న బ్యానర్ లో జై లవకుశ సినిమా చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు త్రివిక్రమ్ మూవీ నిర్మాణంలో కూడా పార్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది.  
 

More Related Stories