మరో సారి దొరికిపోయిన కాపీ క్యాట్ తమన్thaman
2020-03-15 18:05:07

టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకు పోతున్నది తమన్ అనే చెప్పవచ్చు. దేవిశ్రీ ప్రసాద్ తర్వాత ఈ మధ్య కాలంలో అంత పేరు తెచ్చుకున్నాడు తమన్. ఇప్పుడు స్టార్ హీరోలంతా తమ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఫస్ట్ ఆప్షన్ థమన్ ఆయన ఖాళీ లేదంటే దేవిశ్రీ అనే పరిస్థితి వచ్చేసింది. తమన్ మీద ఒక కంప్లైంట్ ఎప్పుడూ ట్రేండింగ్ లో ఉంటుంది. ఇంకేందో అనుకోకండి అదే కాపీ క్యాట్ అనే మరక. ఆయన చేస్తున్న సినిమాల పాటలు బయటికొచ్చిన వెంటనే థమన్ ఈ ట్యూన్ ఆ సినిమా నుండి ఈ ట్యూన్ కాపీ కొట్టాడు. కాదు కాదు ఈ సినిమా నుండి కాపీ కొట్టాడు. అంతే కాదు ఏకంగా తన పాటల నుండి తానే కాపీ కొట్టాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. త్రివిక్రమ్ తెరకెక్కించిన అల..వైకుంఠపురములో సినిమా సంక్రాంతికి రిలీజ్ అయి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. థమన్ అందించిన బాణీలు ఈ సినిమా సక్సెస్‌ లో సింహ భాగం పోషించాయి. థమన్ మ్యూజిక్ వల్ల రిలీజ్‌కి ముందే ఈ చిత్రానికి ఫుల్ హైప్ వచ్చిందని చెప్పవచ్చు.

సామజవరగమనా, రాములో రాములో, బుట్ట బొమ్మ సాంగ్స్ ఇతర దేశాల వారిని కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయంటే దాని క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు. సినిమా రిలీజయిన చాలా రోజులకి రాములో రాములా సాంగ్ విషయంలో థమన్ ఇప్పుడు నెటిజన్స్‌కి అడ్డంగా దొరికిపోవడం సంచలనంగా మారింది. దగ్గర దగ్గర ఐదేళ్ళ క్రితం ఉదయ భాను హోస్ట్ చేసిన దరువు అనే ఫోక్ సాంగ్స్ రియాలిటీ షోలో ఓ మహిళ ఇదే ట్యూన్‌ లో బాయిలోను బల్లి పలికే అంటూ పాడిన పాటను ఇప్పుడు నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. అయితే గతంలో తాను ఇలాంటి విమర్శలను అస్సలు పట్టించుకోనని తమన్ చెప్పారు. తనను విమర్శించడం ద్వారా డబ్బు సంపాదిస్తున్నారని అలా సంపాదిస్తున్న వారి సంపాదనను దెబ్బకొట్టడం ఇష్టం లేక తాను విమర్శలను పట్టించుకోవడం లేదని చెప్పుకొచ్చాడు.

More Related Stories