తమిళ హీరో సూర్య తండ్రి మీద టీటీడీ కేసుSivakumar Suriya
2020-06-07 07:12:48

టీటీడీపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై కేసులు నమోదు అయ్యాయి. తిరుమలలో అసాంఘిక కార్యకలాపలాలు జరుగుతున్నాయంటూ వ్యాఖ్యనించిన ప్రముఖ తమిళ హీరో సూర్యా తండ్రి సినీనటుడు శివకుమార్ మీద కూడా తిరుమలలో కేసు నమోదు చేశారు. శివకుమార్ ఉద్దేశపూర్వకంగానే తిరుమలను పవిత్రను కించపరిచారని తిరుమలకు ఎవరూ వెళ్లవద్దని అన్నారని తమిళనాడుకు చెందిన తమిళమయ్యన్ అనే వ్యక్తి ఈ మెయిల్ లో టీటీడీకి ఫిర్యాదు చేశారు. దీంతో టీటీడీ ఫిర్యాదు మేరకు శివకుమార్ మీద తిరుమలలో కేసు నమోదు చేశారు.

ఇక అలానే టీటీడీ బోర్డ్ మెంబర్ సుధా నారాయణమూర్తి బోర్డ్ సభ్యత్వానికి రాజీనామా చేశారని ఫేస్ బుక్ లో అసత్యప్రచారం చేసిన వ్యక్తి పైన కూడా మరో కేసు నమోదు చేశారు తిరుమల పోలీసులు. అలాగే... తిరుమల ఆలయంలో జూన్ 30 వరకు దర్శనాలు నిలిపివేశారంటూ మాచర్ల శ్రీనివాసులు, ప్రశాంత్, ముంగర శివరామరాజుతోపాటు మరికొన్ని సోషల్ మీడియా సంస్థల్లో తప్పుడు ప్రచారం చేశారని... మరో కేసు పెట్టారు. శ్రీవారికి సంబంధించిన అవ4ఆస్తవ సమాచారాన్ని పోస్ట్ చేశారని... గతంలో తిరుమల బౌధ్దారామం అని తలనీలాల సమర్పణ హిందువుల సాంప్రదాయం కాదని ఫేస్ బుక్ లో పెట్టిన వారిపైనా కేసు నమోదు చేశారు.  బౌద్ధ ఆలయాన్ని ధ్వంసం చేసి వెంకటేశ్వరస్వామి విగ్రహంగా మార్చారని ఆ ఫేస్ బుక్  అకౌంట్ లో ప్రచారం చేశారు. వీటిపై టీటీడీ ఇచ్చిన ఫిర్యాదుతో కేసులు నమోదు చేశారు పోలీసులు.  

More Related Stories