ఆత్మహత్య చేసుకున్నది నా భర్త కాదు:సీరియల్ నటి రేఖrekha
2019-12-31 12:09:33

మూడు రోజుల కింద ఒక యాంకర్ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.  తమిళనాట మంచి యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న రేఖ భర్త గోపీనాథ్ ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ  వార్తలు  వచ్చాయి. పైగా ఆమె కూడా స్పందించకపోవడంతో ఇది నిజమే అని అన్ని మీడియా సంస్థలు కూడా సోషల్ మీడియాలో వైరల్ చేశాయి. అయితే ఈ వార్త తెలిసిన మూడు రోజుల తర్వాత యాంకర్ రేఖ ఇప్పుడు బయటకు వచ్చింది. మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగా తన భర్త ఏమీ ఆత్మహత్యకు పాల్పడలేదని చెప్పడంతో విషయం సంచలనంగా మారింది. డిసెంబర్ 25న గోపీనాథ్‌ అనే వ్యక్తి పెరంబూరులో ఆత్మహత్య చేసుకున్నాడు. అతను బుల్లితెర నటి, వ్యాఖ్యాత రేఖ భర్త అని అన్ని మీడియా సంస్థల్లో కూడా వార్తలు వచ్చాయి.

ఆయన ఆఫీసులో పనిచేసే మరో అమ్మాయితో ఉన్న అక్రమ సంబంధం కారణంగా ఈయన సూసైడ్ చేసుకున్నాడు అంటూ పోలీసులు కూడా అనుమాన పడ్డారు. ఈ వ్వవహారం కారణంగా గోపీనాథ్‌ రేఖ మధ్య తరుచూ గొడవలు జరిగేవని ప్రచారం జరిగింది. అక్రమ సంబంధం అప్పుల బాధ కారణంగా గోపీనాథ్‌ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని చర్చ జరిగింది. అయితే ఇప్పుడు ఈ విషయంపై స్పందించిన యాంకర్ రేఖ.. చనిపోయింది తన భర్త కాదు అంటూ క్లారిటీ ఇచ్చింది. సూసైడ్ చేసుకున్న వ్యక్తి భార్య పేరు జెనీఫర్ రేఖని.. ఆమె పేరులో కూడా రేఖ ఉండటం.. తన భర్త పేరు గోపీనాథ్ కావడంతోనే ఈ ప్రచారం జరిగిందని తెలిపింది. 

More Related Stories