బిగ్ బాస్ 5 లో టీవీ9 యాంకర్Pratyusha
2021-03-17 23:35:47

బిగ్ బాస్ సీజన్ 4 పూర్తి కాగానే సీజన్ 5 ఎప్పుడు మొదలవుతుందా అని ఆసక్తికరంగా చూస్తున్నారు. అయితే సీజన్ 5 ను కూడా మేకర్స్ త్వరలోనే మొదలు పెట్టబోతునట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేది వీరే అంటూ పలువురు కంటెస్టెంట్ ల పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లలో యాంకర్ రవి, షణ్ముక్ జశ్వంత్, బంచిక్ బబ్లూ, హెచ్ ఎమ్ టీవీ యాంకర్ రోజా, యూట్యూబ్ స్టార్ మహతల్లి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా మరో కంటెస్టెంట్ పేరు వినిపిస్తోంది. టీవీ 9 యాంకర్ ప్రత్యుష కూడా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందంటూ గుస గుసలు వినిపిస్తున్నాయి. 

నిన్న ప్రత్యుష పుట్టిన రోజు సంధర్బంగా ఆమె క్లోజ్ ఫ్రెండ్ బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ దేవీ నాగావల్లి ప్రత్యుష ఫోటోలను షేర్ చేసింది. ఇక ఇప్పటికే ప్రత్యుష బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని ఆమె సోషల్ మీడియా ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తుండగా.. దేవీ నాగావల్లి విషెస్ చెప్పడంతో ప్రత్యుష బిగ్ బాస్ ఎంట్రీ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక ఇప్పటికే తెలుగులో బిగ్ బాస్ 4 సీజన్ లను పూర్తి చేసుకుంది. మొదటి మూడు సీజన్ లకు అంతా పాజిటివ్ టాక్ రాగా సీజన్ 4 కు కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ సీజన్ 4 కే ఎక్కువ రేటింగ్ వచ్చినట్టు హోస్ట్ నాగార్జున పదే పదే గుర్తు చేశారు. ఇక బిగ్ బాస్ సీజన్ 5 ఎలా ఉంటుందో చూడాలి.

More Related Stories