నా భర్త గే అన్నారు...అక్షయ్ భార్య సంచలన వ్యాఖ్యలుTwinkle Khanna
2020-05-12 18:46:00

అక్షయ్ కుమార్ గే అని అంటే ఎవరైనా నమ్ముతారా ? అంటే అది అతని వ్యక్తిగతం కదా మనకెందుకు అనుకోవచ్చు. కానీ ఆయనను పెళ్లి చేసుకోవాల్సిన ఆమెకు ఆమె తల్లి ఈ విషయం చెబితే ఇంకేమన్నా ఉందా ? అయితే నిజంగానే అతడి భార్య ట్వింకిల్ ఖన్నాకు ఆమె తల్లి డింపుల్ కపాడియా అక్షయ్ గే అని చెప్పిందని ట్వింకిల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. అక్షయ్ తో తన పెళ్లి ప్రస్తావన గురించి చర్చ వచ్చినప్పుడు డింపుల్ ఈ విషయాన్ని చెప్పినట్టు ట్వింకిల్ తెలిపింది. అక్షయ్, తో నా పెళ్లి గురించి మా అమ్మకు చెప్పామన్న ఆమె అక్షయ్ వెళ్లిన తర్వాత అమ్మ నాకో మాట చెప్పాలందని ట్వింకిల్ చెప్పుకొచ్చింది. అప్పుడు అక్షయ్ గే అని చెప్పిందని, ఈ విషయం ఆమె ఫ్రెండ్స్ ద్వారా తెలిసిందని ఆమె చెప్పిందని ట్వింకిల్ పేర్కొంది. ఆ మాటతో షాక్‌కి గురయ్యానని ట్వింకిల్ పేర్కొంది. దీంతో పెళ్లి చేసుకోవాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డానన్న ఆమె తన డింపుల్ కపాడియా తమ పెళ్లికి ఓ షరతు విధించిందని పేర్కొన్నారు. ఏడాదిపాటు తాము డేటింగ్ చేయాలని చెప్పిందని అందుకే తాము సహజీవనం చేసిన సంవత్సరం తర్వాత 2001లో వివాహం చేసుకున్నామని ఆమె పేర్కొంది.   


 

More Related Stories