తమన్నాకే అదిరిపోయే గిఫ్ట్ ఇస్తే చిరుకి ఏమిస్తుందో Tamanna
2019-10-05 08:52:30

మన తెలుగు ఇండస్ట్రీలో హీరోలు డైరెక్టర్స్ కి గిఫ్టులు ఇవ్వడం కొత్తేమీ కాదు. ఒకప్పుడు భారిగా ఉండే ఈ సంప్రదాయాన్ని మళ్ళీ రామ్ మొదలెట్టాడు. కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ ""ఇస్మార్ట్‌ శంకర్‌'' ఇచ్చిన పూరీ జగన్నాథ్‌కు ఏమిచ్చినా తక్కువే అనుకున్నాడు రామ్‌. ఈ సినిమాతో రామ్‌ ఫస్ట్‌ టైం 30 కోట్ల క్లబ్‌లోకి చేరాడు.  గుర్తిండిపోయే సినిమా ఇచ్చిన పూరీ బర్త్‌డే సందర్భంగా 4 వేల డాలర్లు ఖర్చుపెట్టి అమెరికా నుంచి తీసుకొచ్చిన స్పీకర్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఇది చూసిన పూరీ ఆనందంతో రామ్‌కు థ్యాంక్స్‌ చెబుతూ వీడియో రిలీజ్‌ చేశాడు. ఇక మహేష్ బాబు, ఎన్టీఆర్ ల సంగతి కూడా తెలిసిందే. అయితే తాజాగా సైరా నరసింహారెడ్డిలో తమన్నా యాక్టింగ్‌కు ఉపాసన ఫిదా అయిపోయింది. ఏమిచ్చినా తక్కువే అనుకునన ఉపాసన తమన్నాకు  

కాస్ట్‌లీ గిఫ్టు ఇచ్చేసిందని అంటున్నారు. సైరా సినిమాని రామ్‌చరణ్ 250 కోట్లకు పైగా బడ్జెట్‌తో తీశాడు. భర్త నిర్మించిన సైరా ఉపాసనకు బాగా నచ్చింది. ముఖ్యంగా తమన్నా పాత్రకు ఫ్యాన్ అయిపోయింది. ఇంత బాగా చేసి సినిమాకు హైలైట్ అయిన తమన్నాకు  ఖరీదైన రింగ్‌ను బహుమతిగా ఇచ్చింది ఉపాసన. ఈ రింగ్‌ను తమన్నా పెట్టుకుంటే.. రింగ్‌లో వున్న స్టోన్‌.. చేయిని డామినేట్‌ చేసినంత పెద్దదిగా వుంది. ""తమన్నాకు నిర్మాత భార్య నుంచి ఓ బహుమతి. నిన్ను మిస్‌ అవుతున్నాం. త్వరలో కుద్దామంటూ ట్వీట్‌ చేసింది ఉపాసన.  అయితే నిర్మాత భార్యగా.. ఉపాసన తమన్నాకే ఇలాంటి బహుమతి ఇస్తే ఇక  కోడలుగా మామగారికి  ఎలాంటి గిఫ్టు ఇస్తుందోనన్న కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.  

More Related Stories