ఆ విషయంలో అత్తమ్మే ఆదర్శం.. ఉపాసన ఎమోషనల్ ట్వీట్..upasana
2020-05-14 02:15:12

ఉపాసన కొణిదెల... పరిచయం అక్కర్లేని పేరు. రామ్ చరణ్ భార్యగానే కాకుండా సొంతంగా గుర్తింపు తెచ్చుకుంది ఈమె. ఇప్పటికే చాలా స్వచ్ఛంద సేవలు చేస్తూ అభిమానులకు, జనానికి దగ్గరైంది ఉపాసన. రెండు పెద్ద కుటుంబాల పేరు నిలబెడుతూ ముందుకు సాగుతుంది ఈమె. అంతేకాకుండా అపోలో హాస్పిటల్స్ విషయంలో కూడా తనదైన తెలివితేటలు చూపిస్తూ చురుకైన పాత్ర పోషిస్తుంది ఉపాసన. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ ఈ మెగా కోడలు. ఇక మొన్న మే 10 న మాతృ దినోత్సవం సందర్భంగా ఉపాసన తన సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఇది చూసి అభిమానులు కూడా ఎమోషనల్ అయ్యారు. ఆ పోస్ట్‌లో తన అత్తమ్మ సురేఖతో పాటు రామ్ చరణ్ నాయనమ్మ అంజనా దేవి కూడా ఉన్నారు. ఈ ఫోటోను షేర్ చేస్తూ.. ఒక మహిళ పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఆ ఇంటికి కోడలు మాత్రమే కాదు.. కూతురు కూడా.. అంతేకాదు భర్తతో పాటు ఆమె కూడా ఆ ఇంటి బాధ్యతలు సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది.. ఉంటుంది.. అందులో తమ అత్తమ్మ తన బాధ్యతలను చక్కగా నెరవేర్చిందని చెప్పుకొచ్చింది. తాను కూడా ఈ విషయంలో అత్తమ్మనే ఫాలో అవుతున్నట్లు చెప్పింది ఉపాసన. ఆ ఇంటి భాద్యతల్నీ నేరవేర్చుతాననే నమ్మకం తనకుందని చెప్పుకొచ్చింది మెగా కోడలు. ఈ పోస్ట్ ఇప్పుడు బాగానే వైరల్ అవుతుంది.

More Related Stories