ఆవులకు గడ్డి వేస్తూ.. పేడ తీస్తూ ఉపాసన..upasana
2020-05-15 14:38:27

టాలీవుడ్ లో ఉన్న ల‌వ్లీ క‌పుల్స్ లో రామ్ చ‌ర‌ణ్, ఉపాస‌న కూడా ఉన్నారు. ఈ ఇద్ద‌రూ ఎప్పుడూ హాయిగా సంతోషంగా ఉంటారు. బ‌య‌టికి కూడా బెస్ట్ క‌పుల్ గా ఆద‌ర్శంగా ఉంటారు. ఇక ఉప్సీ కూడా చ‌ర‌ణ్ సినిమాల‌తో పాటు బిజినెస్ లు కూడా చూసుకుంటుంది. ఇప్పుడు కూడా లాక్ డౌన్ కావడంతో హాయిగా భర్తతో కలిసి టైమ్ స్పెండ్ చేస్తుంది ఉపాసన. దాంతో పాటే పర్సనల్ పనులు కూడా చేసుకుంటుంది. ఇప్పుడు ఈమె పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అందులో తన ఫామ్ హౌజ్ లో ఆవులకు గడ్డి వేస్తూ.. పేడ తీస్తూ వాటితో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అలా ఉపాసనను చూసిన మెగా ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోతున్నారు. మీ సింప్లిసిటీకి కోటి దండాలు అంటున్నారు. మరోవైపు లాక్ డౌన్ లో వంటలతో కూడా బిజీ అయిపోయింది ఉపాసన. మొన్నటికి మొన్న కేక్ చేసింది.. దానికి ముందు పచ్చడి పెట్టింది.. అలా ఫుల్ బిజీగా మారిపోయింది మెగా కోడలు.

More Related Stories