డిసెంబర్ అంతా అమెజాన్ సందడే.. రాబోతున్న సినిమాలివే..amazon
2019-12-02 01:54:34

డిజిటల్ ప్లాట్ ఫామ్స్ వచ్చిన తర్వాత థియేటర్స్ కు వెళ్లడం కూడా మానేసారు ప్రేక్షకులు. నెల రోజులు ఓపిక పడితే అంతా ఇంట్లో కూర్చుని చూడొచ్చులే అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని అమెజాన్ రూల్ చేస్తుంది. నెల రోజుల్లోనే ఒరిజినల్ ప్రింట్స్ విడుదల చేసి సంచలనాలు రేపుతుంది. ఇప్పటికే సైరా, సాహో లాంటి సినిమాలు కూడా ఇందులో కనిపిస్తున్నాయి. ఇప్పుడు డిసెంబర్ లో కూడా కొత్త కొత్త సినిమాలను విడుదల చేయబోతున్నారు. అందులో చాలా వరకు భారీ సినిమాలున్నాయి. అందులో వార్ సినిమా కూడా ఉంది. సైనికుల పాత్రల్లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కనిపించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. దీనికి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. మాజీ మెంటార్‌ను హతమార్చేందుకు భారత సైనికుడమే సినిమా కథ.. వీరిద్దరి మధ్య ఉండే యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలెట్. సిద్ధార్థ్ ఆనంద్ దీనికి దర్శకుడు. దాదాపు 300 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ చిత్రం.

ఇక రెండో సినిమా కన్నడలో వచ్చిన బ్లాక్ బస్టర్ గంటుమూటె.. ఇది ఓ ఎమోషనల్ డ్రామా. టీనేజర్ మీరా హైస్కూల్‌ జీవితంలోని తన తొలి ప్రేమ గురించి చెబుతుంది. ప్రేమను ఓ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించారు. మరాఠీలో ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ట్రిపుల్ సీట్ పై కూడా మంచి అంచనాలున్నాయి. గుమ్నామీ అనే హిందీ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం తర్వాత జరిగిన కథ ఇది. 1999 నుంచి 2005వరకూ ఏం జరిగిందోనని ముఖర్జీ కమిషన్ ఏర్పాటు గురించి తెలిపిన కథాంశం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుకున్న మిస్టరీ గురించి చెప్పే సినిమా. వీటితో పాటు హాలీవుడ్ సినిమాలు కూడా డిసెంబర్ లోనే చాలా వస్తున్నాయి. మరి అవన్నీ అమెజాన్ లో ఎలాంటి అద్భుతాలు చేస్తాయో చూడాలి.

More Related Stories