విలన్‌గా నటిస్తానంటున్న స్టార్ హీరో.. Upendra
2020-04-06 21:56:37

సీనియర్ హీరోలకు అవకాశాలు రాని సమయంలో కచ్చితంగా విలన్ వేషాలు వేస్తుంటారు. కొందరు మాత్రం కారెక్టర్ ఆర్టిస్టులుగా మారుతుంటారు కానీ చాలా మంది విలన్స్ అవుతుంటారు. ఇప్పటికే జగనతిబాబు, శ్రీకాంత్, అర్జున్ లాంటి సీనియర్ స్టార్స్ విలన్స్ అయ్యారు. ఇప్పుడు మరో హీరో కూడా ఇదే చేస్తానంటున్నాడు. పైగా తమ భాషల్లో ఉన్న ఇమేజ్ కారణంగా వాళ్లు విలన్స్ కాలేరు కానీ పక్క భాషల్లోకి వెళ్లి అక్కడ విలన్స్ చేస్తుంటారు. ఆది పినిశెట్టి, సుదీప్ లాంటి వాళ్లు దీనికి నిదర్శనం. ఇప్పుడు కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా ఇదే చేస్తానంటున్నాడు. 

ఈయనకు కన్నడలో మంచి మార్కెట్ ఉంది. ఇప్పటికీ ఆయన సినిమాలు అక్కడ విజయాలు అందుకుంటున్నాయి. ఫ్యాన్స్ కూడా ఉన్నారు ఉపేంద్రకు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయన తెలుగులో విలన్ వేషాలు వేస్తానంటున్నాడు. ఉపేంద్ర తెలుగులో నటించడం ఇదే తొలిసారేం కాదు. ఈవీవీ కన్యాదానం నుంచి తెలుగులో నటిస్తూనే ఉన్నాడు ఉపేంద్ర. దాంతో పాటు ఐదేళ్ల కింద అల్లు అర్జున్ సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో కూడా కీలక పాత్రలో నటించాడు. ఇప్పుడు విలన్ గా నటిస్తానంటున్నాడు. కంప్లీట్ విలన్ రోల్ చేయడానికి నేను రెడీ అని గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నా కూడా అవకాశాలు మాత్రం రావడం లేదు. మరి చూడాలిక.. ఈయనతో ప్రతినాయకుడి పాత్ర చేయించే దర్శకుడు ఎక్కడున్నాడో..? 

More Related Stories