నెట్ ఫ్లిక్స్ లో ఉప్పెన..ఎప్పటి నుంచి అంటే..Uppena
2021-02-14 04:06:10

వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమా ఉప్పెన సినిమా ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగా మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు అంతటా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. దాంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. మరోవైపు 100శాతం సీటింగ్ పర్మిషన్ ఇవ్వడంతో థియేటర్ల వద్ద సందడి వాతావరణం కనిపిస్తోంది. ఇక సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో ఓటీటీ ప్రియులు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. కాగా వారికి ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ గుడ్ న్యూస్ చెప్పింది. 

సినిమా హక్కులను సొంతం చేసుకున్నట్టు స్పష్టం చేసింది. కానీ 60 రోజుల వరకు ఈ సినిమా హక్కులను ఓటీటీ కి ఇవ్వకపోవడం విశేషం. ఇక 60 రోజుల తరువాత అంటే సినిమా ఏప్రిల్ 11 నుండి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉండబోతుంది. ఈ సినిమాకు బుచ్చి బాబు సన దర్శకత్వం వహించగా...మైత్రీమూవీమేకర్స్ సినిమాను నిర్మించింది. ఇక ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం ప్లస్ గా నిలిచింది. అంతే కాకుండా ఇదే మొదటి సినిమా అయినపటికి వైష్ణవ్ తేజ్, హీరోయిన్ క్రితి శెట్టి  తమ నటనతో ఆకట్టుకోవడం విశేషం. అంతే కాకుండా ఇప్పటికే గొప్ప నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి సైతం అంచనాలకు తగ్గట్టుగా నటించి అలరించారు.

More Related Stories