14 కోట్ల ఓటీటీ ఆఫర్ రిజెక్ట్ చేసిన ఉప్పెన టీమ్...నష్టం అంటూ !Uppena
2020-05-22 13:16:49

కరోనా కారణంగా ప్రపంచమంతా లాక్‌డౌన్‌ లోకి వెళ్ళిపోయింది. అన్ని రంగాల లాగే సినిమా పరిశ్రమ కూడా పూర్తిగా స్తంభించిపోయింది. థియేటర్లు మాత్రమె కాక సినిమా షూటింగ్స్ అన్నీ  ఆగిపోవడంతో సినీ పరిశ్రమ తీవ్ర సంక్షోంభంలో వుంది. ఇక థియేటర్లు ఎప్పుడూ ఓపెన్‌ అవుతాయో తెలియని స్థితి కారణంగా కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదల చేయడానికి రెడీ అవుతున్నాయనే ప్రచారం జరిగింది. ఏకంగా నాని వీ, అనుష్క నిశ్శబ్దం లాంటి సినిమాలే రిలీజ్ అయిపోతాయని ప్రచారం జరిగినా అదేమీ లేదని ఆయా మేకర్స్ తెల్చేశాయి. అయితే కొన్ని సినిమాల మేకర్స్ మాత్రం తమ తమ సినిమాలను ఓటీటీలకు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికే అమృతరామమ్ అనే సినిమా రిలీజయినా అది పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక కీర్తి, జ్యోతిక, అమితాబ్, అక్షయ్ కుమార్ లాంటి వాళ్ళ సినిమాలు కూడా డైరెక్ట్ రిలీజ్ అవుతున్నాయి. అయితే హీరో వైష్ణ‌వ్ తేజ్ డెబ్యూ హీరోగా తెర‌కెక్కిన ఉప్పెనని కూడా ఓటీటీలో విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావించారు. కాని డీల్ కుద‌ర‌క‌పోవ‌డంతో వెన‌క్కి తగ్గిన‌ట్టు చెబుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఉప్పెన చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని సుమారుగా 18 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ తెర‌కెక్కించిన‌ట్టు తెలుస్తుండ‌గా ఓటీటీ వారు ఆ చిత్రానికి రూ. 14 కోట్ల ఆఫ‌ర్ ఇచ్చార‌ని అంటున్నారు. అయితే నాలుగు కోట్ల నష్టానికి ఈ సినిమాని అమ్ముకోలేమని నిర్మాత‌లు సున్నితంగా ఆ ఆఫర్ తిర‌స్కరించిన‌ట్టుగా ప్రచారం జరుగుతోంది.  కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టించిన ఈ సినిమాలో విజ‌య్ సేతుప‌తి కీలకమైన పాత్ర పోషించాడు. ఏప్రిల్‌ 2న రిలీజ్ కావలసిన ఈ సినిమా లాక్‌డౌన్ వ‌ల‌న వాయిదా పడింది. 

 

More Related Stories