యాంకర్ ప్రదీప్‌కు అండగా నిలిచిన అల్లు అరవింద్ యువీ క్రియేషన్స్.. 



pradeep11
2021-01-21 17:17:21

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అతికొద్దిమంది మేల్ యాంకర్స్ లో ప్రదీప్ కూడా ఒకడు. తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ కుర్ర యాంకర్ ఇప్పుడు హీరోగా వస్తున్నాడు. 30 రోజుల్లో ప్రేమించటం ఎలా..? సినిమాతో హీరోగా మారిపోయాడు ఈయన. గతంలో అత్తారింటికి దారేది, జులాయి లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన ఈయన.. ఇప్పుడు మెయిన్ లీడ్ చేస్తున్నాడు. ఈ చిత్రం గతేడాది ఉగాది సందర్భంగా మార్చి 25న విడుదల చేయాలనుకున్నారు కానీ మధ్యలో కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. మధ్యలో ఓటిటి ఆఫర్స్ వచ్చినా కూడా సినిమాను థియేటర్స్ లోనే విడుదల చేయాలని నిర్మాతలు కూడా పట్టు బట్టారు. ఇప్పుడు వాళ్లు అనుకున్నట్లుగానే ఈ సినిమాను జనవరి 29న విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్ కూడా భారీగానే జరుగుతున్నాయి. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. తమిళమ్మాయి అమృత అయ్యర్ ఇందులో హీరోయిన్ గా పరిచయం అవుతుంది. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 

పల్లెటూరి నేపథ్యంతో పాటు సిటీ కల్చర్ కూడా కలిసిన అందమైన ప్రేమకథగా ఇది వస్తుంది. ఈ సినిమా కోసం మంచి బడ్జెట్ పెడుతున్నారు. కచ్చితంగా ఈ చిత్రంతో హీరోగా గుర్తింపు వస్తుందని నమ్ముతున్నాడు ప్రదీప్. ఇదిలా ఉంటే ప్రదీప్ సినిమాను ఇప్పుడు ఇద్దరు అగ్ర నిర్మాణ సంస్థలు బ్యాకప్ చేస్తున్నాయి. గీతా ఆర్ట్స్ తో పాటు యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను విడుదల చేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 400 థియేటర్స్ లో ప్రదీప్ సినిమా విడుదల కానుందని తెలుస్తుంది. ఈ రెండు అగ్ర నిర్మాణ సంస్థలు వచ్చాయని తెలిసిన తర్వాత ప్రదీప్ కూడా తన సినిమాపై ప్రశాంతంగా ఉన్నాడు. సుకుమార్ శిష్యుడు మున్నా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. గతంలో యాంకర్స్ హీరోలుగా మారి సక్సెస్ అయింది లేదు.. యాంకర్ రవితో పాటు మరికొందరు కూడా హీరోలుగా ట్రై చేసి సక్సెస్ కాలేకపోయారు. మరి ప్రదీప్ మంచి బ్యాకప్ తో వస్తున్నాడు. ఏం చేస్తాడో చూడాలిక. 

More Related Stories