హైకోర్టుకు చేరిన సైరా వివాదంsyeraa
2019-09-23 20:13:48

ఎట్టకేలకి సైరా సినిమా వివాదం హైకోర్టుకు చేరింది. సైరా సినిమా విడుదల కాకుండా ఆపాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వారసులు. అయితే వారు దాఖలు చేసిన ఈ పిటిషన్ రేపు విచారణకు రానుంది. చిరంజీవి, రామ్ చరణ్ ఉయ్యాలవాడ వారసులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి కథ తీసుకొని మోసం చేశారని వారు ఆర్పోపిస్తున్నారు. తమకు చిరంజీవి, రామ్ చరణ్ లు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని వారు పేర్కొన్నట్టు సమాచారం. న్యాయం కోసం పోరాటం చేస్తే తమపైనే అక్రమ కేసులు పెడుతున్నారని వారు పిటిషన్ లో పేర్కొన్నట్టు చెబుతున్నారు. ఇక తమకు న్యాయం చేసే వరకు సైరా నర్సింహారెడ్డి సినిమాను విడుదల ఆపేయాలని పిటిషన్ లో ఉయ్యాలవాడ వారసులు పేర్కొన్నారని సమాచారం.

 సినిమాకు మార్కెట్ లో 10 శాతం ఇస్తామని అన్నారని అంటే రూ.50కోట్లు తమకు రావాల్సి ఉందని వారుసులు గొడవ చేస్తున్నారు. ఇక కథ విషయంలో  తమను మోసం  చేశారంటూ సెన్సార్ బోర్డుకు కూడ వారు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే  జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో   సైరా నిర్మాత   రామ్ చరణ్,  హీరో చిరంజీవీపై  ఉయ్యాలవాడ వంశం   ఐదో తరానికి చెందిన 23 మంది కేసు పెట్టారని ప్రచారం జరుగుతోంది. సినిమా షూటింగ్  సమయంలో  తమతో మంచిగా మాట్లాడిన రామ్ చరమ్ తమ ఇళ్ళలో కూడా వచ్చి షూటింగ్ లు చేసుకున్నారని ఇప్పుడు సినిమా పూర్తికాగానే   మాట మార్చారని  ఉయ్యాలవాడ వంశీయులు  ఆరోపిస్తున్నారు. అక్టోబర్ 2న   సైరా సినిమా  రిలీజ్ అవుతుండగా మరో పది రోజుల్లో సినిమా ఉండనంగా హైకోర్టుకు  వెళ్లడం  ఆసక్తి రేపుతోంది.

More Related Stories