సోది ఆపు.. దమ్ముంటే నన్ను ఆపు.. అదిరిపోయిన V టీజర్..v
2020-02-18 14:03:06

తెలుగు సినిమా మేకింగ్ స్టైల్ ఈ మధ్య మారిపోయింది. హాలీవుడ్ సినిమాలు కూడా అబ్బో అనుకునేలా మన దర్శకులు కూడా ఈ మధ్య అద్భుతమైన టేకింగ్ తో అలరిస్తున్నారు. సాఫ్ట్ సినిమాలు తీస్తాడు అని పేరున్న ఇంద్రగంటి మోహన కృష్ణ ఇప్పుడు వి సినిమాతో సంచలనం సృష్టించడానికి వస్తున్నాడు. ఈ టీజర్ చూసిన తర్వాత నిజంగా ఈ సినిమాను ఆయనే తెరకెక్కించాడా అనే అనుమానాలు వస్తాయి. ఇంతకుముందు చేసిన సినిమాలకు ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాకు అస్సలు ఎక్కడా పొంతన లేదు. ముఖ్యంగా నాని క్యారెక్టర్ ఆయన తీర్చిదిద్దిన విధానం అదరహో అనిపిస్తుంది. ఇందులో సైకో పాత్రలో నటించాడు నాని. టీజర్ లోనే నాని లుక్ అదిరిపోయింది. ఇది ఆయనకు 25వ సినిమా. కాస్త వెరైటీగా ఉంటుందని పూర్తిస్థాయి ప్రతినాయకుడి పాత్రలో నటించాడు నాని. నాచురల్ స్టార్ నటనకు ఖచ్చితంగా ఈసారి ప్రేక్షకులు ఫిదా అయిపోయేలా కనిపిస్తున్నారు. దానికి తోడు పోలీస్ ఆఫీసర్ పాత్రలో సుధీర్ బాబు కూడా అద్భుతంగా నటించాడు. వీళ్లిద్దరి మధ్య దొంగ పోలీస్ ఆట సినిమాను మరో స్థాయిలో నిలబెట్టేలా కనిపిస్తోంది. అత్యద్భుతమైన విజువల్స్.. మేకింగ్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. నాని కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది. 40 కోట్లకు పైగానే ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నట్లు నిర్మాత. మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది వి నివేదా థామస్ హీరోయిన్ గా నటిస్తోంది. అష్టాచమ్మా, జెంటిల్ మెన్ సినిమాలతో ఇప్పటికే రెండు హిట్ సినిమా లు ఇచ్చారు ఇంద్రగంటి నాని. ఇప్పుడు హ్యాట్రిక్ పూర్తిచేయాలని వస్తున్నారు. మరి నాని విలన్ వేషాలకు ప్రేక్షకులు ఎంత వరకు ఫిదా అవుతారనేది చూడాలి.

 

More Related Stories