వాణీ కపూర్ తో ప్రభాస్ రొమాన్స్ Vaani kapoor
2021-07-06 19:58:02

కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం సలార్.  తాజాగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‏డేట్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోంది. ఇప్పటికే మెయిన్ హీరోయిన్ గా శృతి హాసన్ ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. మరొక హీరోయిన్ కావాలని సెర్చ్ చేస్తున్నారట. ఆ హీరోయిన్ పాత్ర కోసం వాణీ కపూర్ ను ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే ఓ కీలక పాత్ర లో ఆ అమ్మడు కనిపించనుందని ప్రచారం వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుందని టాక్. ఇక డార్లింగ్ ప్రభాస్, పూజా హెగ్దే హీరోహీరోయిన్లుగా నటించిన “రాధేశ్యామ్” సినిమా షూటింగ్ పూర్తైందని.. తర్వలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటికీ ఆ మూవీ సెట్స్ పైనే ఉన్నట్లుగా తెలుస్తోంది.

More Related Stories