వైష్ణవ్ తేజ్ కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్



Vaishnav Tej
2021-03-11 16:30:23

మెగాస్టార్ చిరంజీవికి ఉప్పెన సినిమా తెగ నచ్చేసింది. దాంతో ఉప్పెన విడుదల కు ముందు నుండే సినిమాపై ప్రశంసలు కురిపించారు. సినిమా సూపర్ హిట్ అవ్వడం కాయమని జోశ్యం చెప్పారు. ఇక మెగాస్టార్ చెప్పినట్టే సినిమా సూపర్ హిట్ నిలిచి కలెక్షన్ లను కొల్లగొట్టింది. దాంతో మెగాస్టార్ చిత్ర యూనిట్ సభ్యులకు పలువురికి అభినందన లేఖలతో పాటు గిఫ్ట్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ఇప్పటికే మెగాస్టార్ హీరోయిన్ కృతి శెట్టి  మరియు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కు గిఫ్ట్ ల తో పాటు లేఖలు పంపిన సంగతి తెలిసిందే. 

ఇక తాజాగా మెగాస్టార్ సినిమా హీరో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కు ఖరీదైన గిఫ్ట్ ను పంపించి అభినందించారు. మెగాస్టార్ వైష్ణవ్ కు వాచ్ ను పంపగా ఆ వాచ్ చేతికి పెట్టుకున్న వైష్ణవ్ తేజ్ థాంక్యూ మామా అంటూ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఇక వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా అయినప్పటికీ ఉప్పెన లో తన నటన తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దాంతో మెగా ఫ్యామిలీ పేరును నిలబెట్టారు. ఈ సినిమాకు డెబ్యూ దర్శకుడు బుచ్చి బాబు సన దర్శకత్వం వహించారు. ఇక ఈ ప్రస్తుతం హీరో వైష్ణవ్ తో పాటు బుచ్చి బాబు, కృతి శెట్టి లకు సైతం ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయి.

More Related Stories