వైష్ణవ్ తేజ్ ఆ అరుదైన రికార్డు అందుకుంటాడా..Vaisshnav Tej
2021-02-25 10:21:40

మెగా కుటుంబం నుంచి ఎలాంటి వారసులు వచ్చినా కూడా ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మిగిలినవారితో పోలిస్తే మెగా హీరోలకు బయట డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కూడా సంచలన విజయంతో ఇండస్ట్రీకి వచ్చాడు. ఈయన నటించిన తొలి సినిమా ఉప్పెన కలెక్షన్ల ఉప్పెన సృష్టిస్తుంది. కేవలం 10 రోజుల్లో 44 కోట్ల షేర్ వసూలు చేసి డెబ్యూ హీరోల చరిత్రలో ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేశాడు. ఏకంగా హృతిక్ రోషన్ పేరుమీద ఉన్న రికార్డులను కూడా వైష్ణవ్ సొంతం చేసుకున్నాడు. ఇండియాలో ఇప్పటి వరకు తొలి సినిమాతోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన కొత్త హీరోగా మెగా మేనల్లుడు కొత్త చరిత్రకు తెరతీశాడు. 

ఇదిలా ఉంటే తాజాగా మరో రికార్డు ఉప్పెన ముందు నిలిచింది. ఇప్పటి వరకు 45 కోట్ల షేర్ వసూలు చేసింది ఉప్పెన. మరో 5 కోట్లు వసూలు చేస్తే తొలి సినిమాతోనే 50 కోట్ల షేర్ వసూలు చేసిన తొలి హీరోగా నిలబడతాడు వైష్ణవ్. ఇప్పటివరకు కలలో కూడా ఏ హీరో సాధించని రికార్డు ఇది. ఈయన కంటే ముందు మెగా వారసుడు రామ్ చరణ్ తొలి సినిమాతో 25 కోట్ల మార్క్ అందుకున్నాడు. చిరుత సినిమాతో ఈయన ఆ ఫీట్ సాధించాడు. చిరుత రికార్డు బద్దలు అవడానికి 14 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు గాని ఉప్పెన 50 కోట్ల షేర్ అందుకుంటే ఖచ్చితంగా ఇది రికార్డు బద్దలు కొట్టడానికి చాలా సమయం పడుతుంది. తొలి సినిమాతోనే ఇంతటి సంచలన విజయం అందుకోవాలంటే అన్ని కలిసి రావాలి. ఉప్పెన సినిమాకు అలా అన్నీ కలిసొచ్చాయి. మరి ఆ రేంజ్ లో కలిసొచ్చే హీరో మళ్లీ ఎప్పుడు వస్తాడో చూడాలి.

More Related Stories