ఫ్యామిలీతో బ‌ర్త్‌డే సెల‌బ్రేట్ చేసుకున్న వేణు శ్రీరామ్ 



Venu Sriram
2021-05-05 11:14:14

వేణు శ్రీరామ్ త‌న బ‌ర్త్‌డేను కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి సింపుల్‌గా జ‌రుపుకున్నాడు. పింక్ సినిమా ను మాస్ సినిమాగా మార్చి పవన్ ఇమేజ్ కు తగ్గట్లుగా మంచి మెసేజ్ ను ఏమాత్రం పాడు చేయకుండా వకీల్ సాబ్ ను రూపొందించాడు. చేసిన సినిమాలు తక్కువే అయినా కూడా వకీల్ సాబ్ తో ఒక్కసారిగా అందరి దృష్టిని వేణు శ్రీరామ్ ఆకర్షించాడు. పవన్ తో వకీల్ సాబ్ ఎఫెక్ట్ కారణంగా ఆయన బర్త్ డే సందర్బంగా ట్రెండ్ అవుతున్నాడు. పవన్ కళ్యాణ్ తో మళ్లీ ఈయన సినిమా చేసే అవకాశంను దక్కించుకున్నాడనే వార్తలు వస్తున్నాయి. వకీల్ సాబ్ సక్సెస్ తో అల్లు అర్జున్ తో ఐకాన్ సినిమా ను పట్టాలెక్కించే అవకాశం ఉందని అంటున్నారు. బన్నీ గతంలోనే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ చేసేందుకు ఓకే చెప్పాడు. కాని కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. ఇప్పుడు ఆ సినిమా ను పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

More Related Stories