వకీల్ సాబ్ ఫైట్...సోషల్ మీడియాలో వైరల్Vakeel Saab
2021-01-07 13:13:11

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ మొదలు పెట్టిన నాటి నుంచి ఆ సినిమాకు సంబంధించిన ఫోటోలు లీకవుతూనే వచ్చాయి. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తయిన కూడా లీకుల బెడద మాత్రం తప్పించుకోలేకపోతున్నారు. ఆన్ లొకేషన్ కి సంబంధించిన ఫోటోలు లీకవడమేంటని ఆశ్చర్యపోతున్నారు ఆ చిత్ర యూనిట్. ఇంత మంది కలిసి ఏం చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

లేటెస్ట్ గా  రెండు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలోని క్లైమాక్స్ సాలిడ్ ఫైట్ సీక్వెన్స్ కు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. వీటిని ఎవరూ లీక్ చేయలేదు. ఈ సినిమాలో విలన్ రోల్ చేసిన నటుడు దేవ్ గిల్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అధికారికంగా పంచుకున్నాడు. అక్కడ నుంచి బయటకు వచ్చిన ఈ ఫొటోలు షేర్ల మీద షేర్లు అవుతున్నాయి. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తున్నారు. త్వరలో టీజర్ రిలీజ్ కాబోతుండగా..ఇది పవన్ కమ్ బ్యాక్ మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

More Related Stories