వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ ..పవర్ స్టార్ ట్రేడ్ మార్క్ స్టైల్  Vakeel Saab First Look
2020-03-03 00:33:06

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ వచ్చింది.   రాజకీయాల మధ్యలో కొంచెం సమయం దొరకడంతో  వరుస సినిమాలలో నటిస్తున్నాడు పవన్.  ఈ రోజు రిలీజైన వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ లో తన ట్రేడ్ మార్క్ స్టైల్ తో అదరకొట్టాడు.  ఓ ఏస్ వాన్ లో రకరకాల న్యాయశాస్త్ర పుస్తకాలు, కుర్చీ టేబులు వగైరా వేసుకుని..  కేసు స్డడీ చేస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ లుక్ అదిరిపోయింది.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రాన్ని మే 15న సమ్మర్ కానుకగా రిలీజ్ చేస్తు్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్‌కల్యాణ్‌ 26వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. హీరోగా పవన్ నటిస్తోన్న 24వ సినిమా. నటుడిగా 26వ సినిమా కావడం విశేషం. ఇక పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోందని సమాచారం. ప్రకాష్ రాజ్ ఓ కీలక రోల్ చేస్తున్నారు. 

More Related Stories