వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ విడుదల.. సత్యమేవ జయతే..Vakeel Saab
2020-09-02 18:59:07

పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా రోజులుగా వెయిట్ చేస్తున్న రోజు వచ్చేసింది. ఈయన కొత్త సినిమా గురించి కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్న అభిమానులకు వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ ఆకలి మొత్తం ఒకేసారి తీర్చేసింది. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో లాయర్ గా నటిస్తున్నాడు పవన్ కళ్యాణ్. బాలీవుడ్లో సంచలన విజయం సాధించిన పింక్ సినిమాకు ఇది రీమేక్. ఆ తర్వాత తమిళంలో అజిత్ ఈ సినిమా చేశాడు. అక్కడ కూడా సంచలన విజయం సాధించింది. అమ్మాయిల సమస్యల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. తన రీ ఎంట్రీకి ఇంతకంటే పర్ఫెక్ట్ సినిమా మరోటి ఉండదని పవన్ ప్లాన్ చేసుకున్నాడు. వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ కూడా పక్కా కమర్షియల్ కోణంలోనే ఉంది. పవన్ ఇమేజ్ కి తగ్గట్టుగా ఈ సినిమా కథను కాస్త మార్చారు. దిల్ రాజు, బోని కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. కరోనా వైరస్ కారణంగా అనుకోకుండా షూటింగ్ ఆగిపోయింది. వచ్చే ఏడాది వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో నివేద థామస్, అంజలి కీలక పాత్రలో నటిస్తుండగా.. శృతి హాసన్ పవన్ కళ్యాణ్ కు జోడీగా నటిస్తోంది. ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. మోషన్ పోస్టర్ అదిరిపోవడంతో సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి.

More Related Stories