అన్న అనుకున్న డేట్ కి పవన్ సినిమా రిలీజ్  Vakeel saab
2020-04-08 12:40:14

ఇంకా అసలు సినిమాలే చేయనని చాలా సార్లు చెప్పిన పవన్ ఇప్పుడు ఏకంగా వరుసగా మూడు నాలుగు సినిమాలు ఒప్పుకుని తన అభిమానులకే కాక సినీప్రియులకు కూడా షాకిచ్చారు. ఆయన రీఎంట్రీ చిత్రం ‘పింక్‌’ రీమేక్‌ ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకోగా వేసవి కానుకగా మే 15న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే కరోనా దెబ్బకు ఆ ప్లాన్ అంతా అప్సెట్ అయింది. దాడాపుగా షూట్ పూర్తి చేసుకున్న ఆ సినిమా విడుదల వాయిదా వేయక తప్పని పరిస్థితి. అయితే క‌రోనా కార‌ణంగా ‘వ‌కీల్ సాబ్‌’ ముందు అనుకున్నట్టు మే 15న‌ కాకుండా.. ఆగ‌స్టు 14న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని ద‌ర్శక‌నిర్మాత‌లు భావిస్తున్నట్టు చెబుతున్నారు. 

నిజానికి ఇదే తేదీకి మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ విడుద‌ల కావ‌ల‌సి ఉండగా అసలు ఆ సినిమా షూట్ కూడా సగం పైగా పెండింగ్ ఉంది. ఇప్పుడు ఈ కరోనా కాటు వేసింది. ఈ దెబ్బకి ఆ సినిమా వ‌చ్చే ఏడాది వేస‌వికి వాయిదా పడిందట. ఈ నేప‌థ్యంలోనే వ‌కీల్ సాబ్ రిలీజ్ ఆగ‌స్టు 14కి ఫిక్స్ అయింద‌ని అంటున్నారు. త్వర‌లోనే ‘వ‌కీల్ సాబ్‌’ విడుద‌ల తేదికి సంబంధించి మ‌రింత క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.  పవన్ రీఎంట్రీ సినిమాని ఎప్పుడెప్పుడూ చేద్దామా అని ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులకు మాత్రం ఇది బాగా నిరాశ పరిచే వార్త అనే చెప్పాలి. ఇక దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బోని కపూర్ సమర్పిస్తున్నారు.  

More Related Stories