ఓవర్సీస్‌లో భారీగా వకీల్ సాబ్ ప్రీమియర్స్ Vakeel Saab
2021-04-03 16:10:36

ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్ సాబ్ సినిమాతో తెలుగు సినిమాకు ఓవ‌ర్సీస్‌లో మున‌ప‌టి క‌ళ‌ను తీసుకురావాల‌ని భావిస్తున్నారు. అందుకే ఓవర్సీస్‌లోనే 700 స్క్రీన్ల‌లో వ‌కీల్ సాబ్ సినిమాను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత బోనీ కపూర్ ప్రకటించాడు. కరోనా తర్వాత ఇంత భారీ ఎత్తున ఓ సినిమా విదేశాల్లో ప్రీమియర్స్ పడటం ఇదే మొదటిసారి.  ఏప్రిల్ 9న తెలుగు రాష్ట్రాల్లో ఏ థియేటర్‌లో చూసినా కూడా పవన్ బొమ్మే కనిపించేలా విడుదల ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. దాదాపు 95 శాతం థియేటర్స్‌లో వకీల్ సాబ్ మాత్రమే కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో అన్ని రికార్డులను తుడిచిపెట్టే పనిలో పడింది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘వకీల్ సాబ్’.   ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా నివేతా థామస్, అంజలి, అనన్య నాగల్ల కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్’ సినిమాకు రీమేక్.

More Related Stories