కోటి రూపాయ‌ల వకీల్ సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్



Vakeel Saab
2021-03-19 13:42:34

పవర్ స్టార్ కెరీర్‌లో 26వ సినిమాగా తెరకెక్కిన 'వకీల్ సాబ్' సినిమా మీద అందరిలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. శృతి హాసన్ గెస్ట్ రోల్‌లో కనిపించబోతుండగా యంగ్ హీరోయిన్స్ నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ.. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, సీనియర్ నరేష్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. కాగా ఈ సినిమా నుంచి తాజాగా వచ్చిన 'కంటి పాప' అన్న రొమాంటిక్ సాంగ్‌తో పాటు అంతక ముందు వచ్చిన 'సత్యమేవ జయతే', 'మగువా మగువా' ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. 

తాజా సమాచారం ప్రకారం.. వ‌కీల్ సాబ్ చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా తెలుగు రాష్ట్రాల‌లోని ప్ర‌తి జిల్లాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫుల్ ఫొటోతో రూపొందించిన లైట్ బెలూన్స్‌ని ఏర్పాటు చేయ‌నున్నార‌ట‌. వకీల్ సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఏకంగా కోటి ఖర్చు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దిల్ రాజు - బోనీ కపూర్ బృందం కేవలం ఒక్క ఈవెంట్ కోసం అంత రిస్క్ చేయడంపైనా ఇన్ సైడ్ గుసగుసలు వేడెక్కిస్తున్నాయి. అంతేకాదు.. ప్రీరిలీజ్ వేదిక కోసం తమ్ముడి కోసం అన్నయ్య చిరంజీవి.. బాబాయ్ కోసం చెర్రీ ప్రచార బరిలో దిగుతున్నారని తెలుస్తోంది.

More Related Stories