ఎన్టీఆరే కావాలని కూర్చున్న ఫ్లాప్ డైరెక్టర్Vakkantham Vamsi
2020-09-05 22:27:51

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన `నా పేరు సూర్య‌`తో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగు వేశాడు ర‌చ‌యిత వ‌క్కంతం వంశీ. అప్పటి దాకా రైటర్ గా మంచి మంచి సక్సెస్ లను అందుకున్న వక్కంతం వంశీ డైరక్టర్ గా మొదటి సినిమానే ఫ్లాప్ అందుకున్నాడు. ఈ సినిమా బన్నీ కెరియర్ లోనే డిజాస్టర్స్ లిస్ట్ లో అతి పెద్దదిగా మారింది. ఇప్పుడు ఆ రచయిత మరో సినిమా లైన్ లో పెట్టడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. అయితే అది కూడా చిన్నా చితకా హీరోలు కాదు, ఏకంగా ఎన్టీఆర్ నే టార్గెట్ గా పెట్టుకుని మరీ కూర్చున్నాడని అంటున్నారు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళితో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం తర్వాత తారక్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా అనౌన్స్ చేశాడు. అయితే అనౌన్స్ చేయకున్నా ర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఒక భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కూడా రెడీగా ఉంది. ఇలా రెండు సినిమాలు లైనప్ లో ఉన్నా సరే వంశీ మాత్రం తారక్ కావాలని భీష్మించుకు కూర్చున్నట్టు చెబుతున్నారు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కు బూస్ట్ ఇచ్చిన టెంప‌ర్ సినిమా కధ వంశీదే. ఎప్పుడు తన సొంత కథలతోనే సినిమాలు చేసే పూరి జగన్నాథ్ ఫస్ట్ టైం ఈ సినిమా కోసం వక్కంతం వంశీ దగ్గర కథ తీసుకున్నాడు.  

More Related Stories