వరుణ్ తేజ్ సినిమాకు తెలంగాణ కోర్ట్ షాక్.. వాల్మీకి విడుదలవుతుందా..Valmiki
2019-09-13 18:31:46

వాల్మీకి అనే టైటిల్ పెట్టినపుడే హరీష్ శంకర్ కు తెలుసు.. కచ్చితంగా ఇది వివాదం అవుతుందని. కానీ తన సినిమా కథకు ఇదే పర్ఫెక్ట్ అని ముందు నుంచి చెబుతున్నాడు ఈయన. కచ్చితంగా వాల్మీకి పేరుకు అస్సలు మచ్చ తీసుకురామని.. ఇది ఆయన గౌరవం పెంచేలా ఉంటుంది కానీ తగ్గించేలా కాదని చెప్పాడు కూడా. అయినా కూడా బోయ సంఘం మాత్రం అస్సలు ఊరుకోవడం లేదు. తమ కులస్తుడి పేరు చెడగొట్టడానికే ఈ చిత్రానికి వాల్మీకి అనే పేరు పెట్టాడంటున్నారు వాళ్లు. ఇదే విషయంపై ఇదివరకు కూడా రచ్చ చేసినా.. ఇప్పుడు దాన్ని మరింత తీవ్రతరం చేసారు. తాజాగా దీనిపై కోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. కోర్ట్ కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవడమే కాదు.. కేసును కూడా ఫైల్ చేసుకుంది. నాలుగు వారాల్లో దీనిపై సరైన వివరణ ఇవ్వాలని కోర్ట్ ఆదేశం కూడా ఇచ్చింది. వరుణ్ తేజ్, హరీష్ శంకర్ సహా చిత్ర నిర్మాతలకు కూడా నోటీసులు ఇచ్చింది హై కోర్ట్. ఇక మరో వారం రోజుల్లో సినిమా విడుదల ఉండగా ఇప్పుడు ఇలా కావడంతో నిర్మాతలు కూడా టెన్షన్ పడుతున్నారు. నాలుగు వారాల్లో సరైన వివరణ ఇవ్వాలి.. లేకపోతే దానికి తగ్గ పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని కోర్ట్ హెచ్చిరించింది కూడా. మరి దీనిపై హరీష్ శంకర్ ఎలాంటి సమాధానం చెప్తాడో చూడాలి. కచ్చితంగా ఈయన అయితే తన సినిమా టైటిల్ మార్చే ఉద్ధేశంలో లేడు. గతంలో డీజే సమయంలో కూడా ఓ పాట విషయంలో ఇలాగే హరీష్ శంకర్ వివాదాల్లో ఇరుక్కున్నాడు.

More Related Stories