అల్లు అర్జున్ లైన్ వేశాడు...వనితా విజయ్ కుమార్ షాకింగ్ కామెంట్స్



Vanitha Vijay Kumar
2020-12-25 17:08:44

ఎప్పుడూ ఏదో ఒక టాపిక్ తో వార్తల్లో ఉండే నటి వనితా విజయ్ కుమార్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అయితే ఈసారి టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పై సంచలన కామెంట్లు చేసి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం వనిత చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వనిత మాట్లాడుతూ..చెన్నై తెలుగు పరిశ్రమ ఉన్న సమయంలో మెగాఫ్యామిలి తమకు సన్నిహితంగా ఉండేదని తెలిపింది. అప్పుడు అల్లు అర్జున్ తనకు లైన్ వేసే వాడని పేర్కొంది. మెగాస్టార్ నటించిన ఓ ఇంగ్లీష్ సినిమా ఓపెనింగ్ కు వెళ్ళినప్పుడు అక్కడ అల్లు అర్జున్ స్టైలిష్ గా రెడీ అయి తననే చూసాడని పేర్కొంది.

తనకంటే చిన్నవాడైనప్పటికి అల్లు అర్జున్ తననే చూస్తూ ఉన్నాడని చెప్పింది. అపుడు తను మాంగో కలర్ డ్రెస్ వేసుకున్నానని..ఆ తరవాత చాలా సార్లు బన్నీ ఫోన్ మాట్లాడుతూ మాంగో కలర్ డ్రెస్ గురించి ప్రస్తావించడని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా అల్లు అర్జున్ చాలా బాగా డ్యాన్స్ చేస్తాడని తెలిపింది. అవకాశం వస్తే బన్నీ తో నటించడానికి రెడీ అని చెప్పింది. బన్నీ సినిమాలో అత్తగా నటించాలని ఉందని తెలిపింది. అంతే కాకుండా ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే తనకు  ఇష్టమని పేర్కొంది. ఛాన్స్ వస్తే ఎన్టీఆర్ సినిమాలో నటించడానికి సిద్ధమని తెలిపింది. అంతే కాకుండా సినిమాల్లో రమ్యకృష్ణ లాంటి శక్తివంతమైన పాత్రల్లో నటించడం తనకు చాలా ఇష్టమని వనిత విజయ్ కుమార్ పేర్కొంది.

More Related Stories