బోయపాటికి వారణాసి టెన్షన్Boyapati srinu
2020-04-23 10:30:58

డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. నిజానికి అనుకున్న దాని ప్రకారం ఈ సినిమా ఫిబ్రవరిలోనే సెట్స్‌ పైకి వెళ్ళాల్సి ఉంది. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 26 నుంచి జరగనుందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఏమయిందో ఏమో కానీ ఈ సినిమా షూటింగ్ లేట్ గా మార్చ్ నెల మొదట్లో మొదలయింది. ఆ మొదటి షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోండగా కరోనా కాటు వేసింది. అయితే ఈ సినిమా కధ ప్రకారం వారణాసిలో కూడా షూట్ చేయాల్సి ఉంది. ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రలలో నటిస్తారని ఒక పాత్ర అఘోరా పాత్ర అని మరో పాత్ర నార్మల్ పాత్ర అని అంటున్నారు. 

ఇక ఈ అఘోరా పాత్రకు సంబందించిన కొన్ని సీన్స్ వారణాసిలో షూట్ చేయాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ పూర్తయినా మరో మూడు నాలుగు నెలల వరకూ  కాశీలో ఎక్కువ మందితో షూటింగు చేసే అవకాశాలు ఉండక పోవచ్చనే సంకేతాలు వస్తున్నాయట. అప్పటి వరకూ షూటింగును ఆపుకుంటే ప్రాజెక్టు చాలా లేట్ అవుతుంది. పోనీ కథలో మార్పులు చేద్దామా అంటే, వారణాసి ఎపిసోడ్ తోనే మిగతా కథ ముడిపడి ఉంటుందని అంటున్నారు. అందుకే ఏం చేయాలో అర్ధం కాక దర్శకుడు బోయపాటి ఆలోచనలో పడ్డాడట. ఇక ఈ సినిమాతో బోయపాటి కొత్త హీరోయిన్ ను  పరిచయం చేస్తున్నాడని అంటున్నారు.  

More Related Stories