ఆరేళ్ళ తర్వాత మంచి కం బ్యాక్ అందుకున్న శోభనVarane Avashyamund
2020-02-08 12:46:53

చేప కళ్ళ అందాల భామ శోభన. సినీ హీరోయిన్ గా ఎంత ఫేమస్ అయిందో అంతకు మించి నృత్య కళాకారిణిగా ఆమె సుప్రసిద్ధురాలు. నాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిల మేనకోడలు శోభన. నిన్నటి తరం టాప్ హీరోలు అందరితో జత కట్టి మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఆమె అభినందన, రౌడి గారి పెళ్ళాం, రుద్రవీణ, నారి నారి నడుమ మురారి, అల్లుడు గారు లాంటి హిట్ సినిమాల తో తానేంటో నిరూపించుకున్నారు. 

స్వతహాగా మలయాళ అమ్మాయి అయిన శోభన తెలుగుతోపాటు మలయాళ, తమిళ, హిందీ చిత్రాల్లో నటించారు చంద్రముఖి (రజనీకాంత్) చిత్రానికి మూలమైన మలయాళ చిత్రం మణిచిత్రతాజులో అద్భుతంగా నటించి అవార్డు కూడా సాధించారు. భరత నాట్యంలో ఎంతో ముఖ్యమైన అభినయాన్ని ప్రదర్శించడంలో ఆమె దిట్ట. నేటి తరానికి చెందిన ఎందరో కళాకారిణులు ఈమె దగ్గర నటనలోను, నాట్యంలోను శిక్షణ తీసుకుంటున్నారు. 

అయితే అలంటి ఆమె ఆరేళ్ళుగా ఎటువంటి సినిమా చేయలేదు. ఆమె తాజాగా నటించిన సినిమా నిన్న రిలీజ్ అయింది. వరనే అవశ్యముందు అనే సినిమాలో ఆమె పద్నాలుగేళ్ళు తర్వాత సురేష్ గోపితో కలిసి నటించారు. దుల్కర్ సల్మాన్, కళ్యాణి ప్రియదర్శన్ లు నటించిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది.  

More Related Stories