గని గా వరుణ్ తేజ్..ఫస్ట్ లుక్ అదుర్స్



Varun Tej as Ghani
2021-01-19 12:40:33

మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్నాడు. ఈరోజు వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది. సినిమాలో వరుణ్ తేజ్ పేరునే చిత్ర టైటిల్ "గని" గా ప్రకటించింది. మోషన్ పోస్టర్ లో వరుణ్ తేజ్ బాక్సర్ లుక్ లో రింగ్ లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం వరుణ్ లుక్ మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి సినిమాలో వరుణ్ తేజ్ కు కోచ్ గా నటిస్తున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. ఇక "గని" సినిమాతో కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను అల్లు బాబీ, సిద్దు ముద్ద సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. సినిమాలో హీరోయిన్ సాయి మంజ్రేకర్ వరుణ్ తేజ్ తో రొమాన్క్ చేయనుంది. ఈ సినిమాను జులై లో విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం వరుణ్ తేజ్ ఎఫ్-3 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. కరోనా నుండి కోలుకున్న వరుణ్ ఇటీవలే షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమాను కూడా ఈ ఏడాది విడుదల చేయనున్నారు.

More Related Stories