రోజుకి 5 గంటలు కష్టపడుతున్న వరుణ్ తేజ్  Varun Tej
2020-04-27 15:21:38

మెగా ఫ్యామిలీ హీరోలకు ఫుల్ మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. అయితే ఈ ఫ్యామిలీ నుంచే వచ్చిన వరుణ్ తేజ్ మాత్రం మాస్ స్టోరీస్‌కి దూరంగా కొత్త కొత్త కథాంశాలు ఎంచుకుంటున్నాడు. మొదటి నుంచే సమ్‌థింగ్‌ స్పెషల్‌గా కనిపించడానికి ప్రయత్నిస్తోన్న వరుణ్, ఇప్పుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్‌ నేపధ్యంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విలన్ గా నవీన్ చంద్రను ఎంపిక చేసినట్టు కూడా తాజాగా ప్రచారం జరిగింది. ఆ విషయం మీద క్లారిటీ రాకున్నా కరోనా మాత్రం వరుణ్ ని ఇరకాటంలో పెట్టిందని అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న క్రమంలో బాడీని అలానే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది.  ఈ లాక్ డౌన్ దెబ్బకు అందరూ ఇంట్లో ఉండి రిలాక్స్ అవుతుంటే వరుణ్ తేజ్ కి మాత్రం అలా రిలాక్సింగ్ కి కూడా అవకాశం లేదని అంటున్నారు.

ఎందుకంటే బాడీ  మెయింటైనెన్స్  కోసం మనోడు రోజంతా డైట్ లో ఉంటూ, రోజుకి 5 గంటలు జిమ్ చేయాలని అంటున్నారు. నిజానికి అనుకున్నట్టు జరిగితే జూన్ కల్లా సినిమా పూర్తయ్యేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, అసలు ఈ  లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తుందో తెలియకపోవడం వల్ల ఈ క్వారంటైన్ టైం లో కూడా రోజూ 5 గంటల ట్రైనింగ్, ఓన్లీ డైట్ ఫుడ్ మాత్రమే తీసుకుంటూ గడపాల్సి వస్తోంది. ఇంట్లో అందరూ వంటలు చేసుకుంటూ కావాల్సింది తింటున్నా కంప్లీట్ బాక్సింగ్ బాడీ కోసం ఉండడం తన అన్నకి ఇబ్బందిగానే ఉందని నిహారిక చెబుతోంది. నిన్న ఎన్టీవీ లైవ్ లోకి వచ్చిన ఆమె ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది.  

More Related Stories