వాల్మీకిని చుట్టుముట్టిన బోయ కమ్యూనిటీ.. టైటిల్ మార్చాలంటూ డిమాండ్..VarunTej
2019-09-16 16:09:04

వాల్మీకి అనే టైటిల్ పెట్టినపుడే హరీష్ శంకర్ కు తెలుసు.. కచ్చితంగా ఇది వివాదం అవుతుందని. కానీ తన సినిమా కథకు ఇదే పర్ఫెక్ట్ అని ముందు నుంచి చెబుతున్నాడు ఈయన. కచ్చితంగా వాల్మీకి పేరుకు అస్సలు మచ్చ తీసుకురామని.. ఇది ఆయన గౌరవం పెంచేలా ఉంటుంది కానీ తగ్గించేలా కాదని చెప్పాడు కూడా. అయినా కూడా బోయ సంఘం మాత్రం అస్సలు ఊరుకోవడం లేదు. తమ కులస్తుడి పేరు చెడగొట్టడానికే ఈ చిత్రానికి వాల్మీకి అనే పేరు పెట్టాడంటున్నారు వాళ్లు. ఇదే విషయంపై ఇదివరకు కూడా రచ్చ చేసినా.. ఇప్పుడు దాన్ని మరింత తీవ్రతరం చేసారు. మొన్నీమధ్యే దీనిపై కోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. ఇక ఇప్పుడు కూడా మరోసారి తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేసారు బోయ కమ్యూనిటీ. సినిమా టైటిల్ మార్చాలంటూ బోయ వాల్మీకి సామాజిక వర్గం నేతలు ఫిర్యాదు చేసారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా పాల్గొన్నాడు. గ్యాంగ్ స్టార్ సినిమాకి వాల్మీకి టైటిల్ పెట్టడంతో బోయ వాల్మీకి సామజిక వర్గం మనోభావాలు దెబ్బతిన్నాయంటున్నారు వాళ్లు. రామాయణం రాసిన వాల్మీకిని గ్యాంగ్ స్టార్ తో పోల్చడంపై ఆ సామాజిక వర్గం వాళ్ళు తనను సంప్రదించారంటూ చెప్పాడు లక్ష్మణ్. తక్షణమే ఈ సినిమా టైటిల్ మార్చలని డిమాండ్ చేస్తున్నామంటున్నాడు ఆయన. లేకపోతే బోయ కమ్యూనిటీ అంత ఒక్కటవుతుందని లక్ష్మణ్ హెచ్చరిస్తున్నాడు. నిర్మాతలు , డైరెక్టర్, నటులు అందరూ దీనికి బాధ్యత వహించాల్సి వస్తుందని చెబుతున్నారు ఆయన. సెప్టెంబర్ 20న విడుదల కానుంది ఈ చిత్రం. మరి చూడాలిక.. ఈ వివాదాల నుంచి సినిమా ఎప్పటికి బయటపడుతుందో..?

More Related Stories