మెగా ఫ్యామిలీకి మరో హీరో దొరికినట్టేనా ..Venkata Chaitanya
2020-06-20 16:37:34

చైతన్య జొన్నలగడ్డ అనే పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మొన్నటి దాకా ఎవరికీ తెలియని ఈయన నిహారికను పెళ్లి చేసుకుంటున్నాడు అనగానే ఒక్క దెబ్బకు ఈయన మీద జనానికి ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. రాత్రికి రాత్రే ఆయనకు వేళల్లో ఫాలోవర్స్ కూడా పుట్టుకు వచ్చేసారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఈయన నాగబాబు ఫ్రెండ్ అయిన ప్రభాకర రావు కుమారుడు. అప్పట్లో చిరంజీవి తండ్రి ఉద్యోగం నిమిత్తం చిరంజీవి ఫామిలీ చీరాలలో ఉన్నారు. ఆ సమయంలో నాగబాబు తో ఈయన కలిసి చదువుకున్నాడు. అప్పట్లోనే చిరంజీవి ఈ కుటుంబంతో బంధం కలుపుకోవాలని చూసినా కుదరలేదని మళ్లీ ఇప్పుడు చిరంజీవె చొరవ తీసుకొని తన కూతురు నిహారిక విషయంలో ఈ సంబంధం సెట్ చేశాడని ప్రచారం జరుగుతుంది. 

ఆ విషయం పక్కన పెట్టినా కుర్రాడు అందగాడు కావడంతో ఈయన కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడని ప్రచారం చేస్తున్నారు. నిజానికి మెగా కుటుంబం నుండి ఇప్పటికే డజను మందికి పైగా హీరోలు ఉన్నారు. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, అల్లు శిరీష్, సాయి తేజ్, వరుణ్ తేజ్,  కళ్యాణ్ దేవ్, వైష్ణవ్ తేజ్ లాంటి హీరోలు ఇప్పటికే ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఈ జాబితాలో చైతన్య పేరు కూడా చేరుతుందని కొందరు ఎగతాళి చేస్తుంటే, అభిమానులు ఏమో అవన్నీ పట్టించుకోకుండా మెగా ప్రిన్సెస్ కి మెగా ప్రిన్స్ లాంటోడు దొరికాడని సంబర పడుతున్నారు. ఇక ఆగస్టులో నీహారిక- చైతన్య జంట నిశ్చితార్థం జరగనుందని కొందరు అంటుంటే అదేమీ లేదు అదెప్పుడో జరిగిపోయిందని కొందరు అంటున్నారు. ఇక ఈ ఏడాది డిసెంబర్ లో వీరి పెళ్లి జరగచ్చని అంటున్నారు.  

More Related Stories