వెంక‌టాపురం రివ్యూ రేటింగ్Venkatapuram-Movie-Review-Rating
2017-05-13 07:50:43

ప‌దేళ్ల కింద హ్యాపీడేస్ సినిమాలో టైస‌న్ గా న‌టించి గుర్తింపు తెచ్చుకున్న న‌టుడు రాహుల్. ఈ ప‌దేళ్ల గ్యాప్ ల‌లో చాలా సినిమాలు చేసాడు గానీ ఏదీ మ‌నోడికి పెద్ద‌గా స‌క్సెస్ తీసుకురాలేదు. దాంతో ఇప్పుడు వెంక‌టాపురం అంటూ థ్రిల్ల‌ర్ తో వ‌చ్చాడు. మ‌రి ఇదెలా ఉందో చూద్దామా..

కథ : వైజాగ్ బీచ్ లో ఓ ప్రేమ‌జంట విహారానికి వ‌స్తుంది. అక్క‌డ అనుకోకుండా ముగ్గురు క్రిమినల్స్ ఆ అమ్మాయిని ఎత్తుకెళ్లి రేప్ చేసి చంపేస్తారు. ఆ త‌ర్వాత రోజే మ‌రో అమ్మాయి మిస్సింగ్ కేస్ వ‌స్తుంది. తీరా చూస్తే బీచ్ లో ఓ అమ్మాయి డెడ్ బాడీ దొరుకుతుంది. ఆ అమ్మాయి.. త‌ప్పిపోయిన అమ్మాయి ఒక్క‌రే అని పోలీసులు చెబుతారు. ఆ మ‌ర్డ‌ర్ చేసింది ఆనంద్(రాహుల్) అని పోలీసులు క‌న్ఫ‌ర్మ్ చేస్తారు. అత‌డు క‌త్తితో స‌హా పోలీస్ స్టేష‌న్ లో దొరికిపోతాడు. మ‌ర్డ‌ర్ కేస్ లో అమ్మాయి చైత్ర‌(మ‌హిమ‌) అని.. ఆమెను చంపింది ల‌వ‌ర్ ఆనంద్ అని పోలీసులు తేలుస్తారు. అసలు ఆనంద్, చైత్ర ఎవరు.. ? వాళ్ళ ప్రేమ క‌థ ఎలా మొద‌లైంది..? అస‌లెందుకు ఆనంద్ చైత్ర‌ను చంపేస్తాడు..? చ‌ంపితే ఎందుకు..? ఇవ‌న్నీ మిగిలిన క‌థ‌. 

క‌థ‌నం : స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్స్ కు మెయిన్ గా కావాల్సింది స్క్రీన్ ప్లే. ఈ విష‌యంలో ద‌ర్శ‌కుడు వేణు మ‌డిగంటి కాస్త విజ‌యం సాధించాడు. తొలి సీన్ తోనే తాను ఓ థ్రిల్ల‌ర్ ను చూపిస్తున్నాన‌నే ఫీలింగ్ క‌లిగించాడు. హీరో క‌త్తి ప‌ట్టుకుని బీచ్ లో కూర్చోవ‌డం.. ఎవ‌ర్నో న‌ర‌కడం.. తీరా ఆ న‌రికింది హీరోయిన్ ను అని త‌ర్వాత సీన్ లో తెలియ‌డం.. ఇవ‌న్నీ ఆస‌క్తిక‌రంగానే ఉన్నాయి. ఈ క‌థ కూడా రెగ్యులర్ ఫార్మాట్ కు దూరంగా న‌డుస్తుంది. ఫ‌స్టాఫ్ అంతా క్రైమ్ చుట్టూనే తిరుగుతుంది. ఇక సెకండాఫ్ లో చాలా ప్ర‌శ్న‌ల‌కు ఒక్కొక్క‌టిగా స‌మాధానం ఇచ్చాడు ద‌ర్శ‌కుడు. కానీ అవి అంత సాటిస్ ఫైయింగ్ గా అనిపించ‌వు. ఒక చిన్న పాయింట్ ను ప‌ట్టుకుని సినిమా అంతా లాగాలా అనిపిస్తుంది. ఇది థ్రిల్ల‌ర్ కాబ‌ట్టి సినిమా పాయింట్ రివీల్ చేస్తే చూసేవాళ్లకు ఇబ్బందిగా ఉంటుంది అందుకే ఆ పాయింట్ రివీల్ చేయ‌ట్లేదు. దర్శకుడు వేణు రాసుకున్న స్క్రీన్ ఫ్లే బాగానే ఉన్నా.. చిన్న పాయింట్ ను కావాల‌ని దాచేసిన‌ట్లు చికాకు తెప్పిస్తుంది. 

న‌టీన‌టులు : రాహుల్, మ‌హిమ మ‌క్వాన్.. క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: వేణు మ‌దిగంటి  రాహుల్ ప‌ర్లేద‌నిపించాడు. కానీ అత‌డు న‌ట‌న‌లో మాత్రం ఇంకా మెరుగవ్వాల్సింది చాలా ఉంది. హీరోయిన్ మ‌హిమ కూడా అంతంత‌మాత్ర‌మే. మిగిలిన కారెక్ట‌ర్స్ లో ఎవ‌రూ క‌నీసం గుర్తింపు ఉన్న న‌టులు కూడా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఉన్న ఒక్క కాశీవిశ్వనాథ్ కూడా రెండు సీన్ల‌కు ప‌రిమితం అయ్యాడు.

టెక్నిక‌ల్ టీం : ఈ సినిమా ప‌రంగా చూస్తే టెక్నిక‌ల్ టీంలో అచ్చు బాగా స్కోర్ చేసాడు. ఈయ‌న పాటలు బాగున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఇచ్చాడు. కానీ సినిమాకు ఇది స‌రిపోదు. సాయి ప్రకాష్ సినిమాటోగ్రఫీ బాగుంది. నందు ఎడిటింగ్ బోరింగ్. 1 గంట 49 నిమిషాల సినిమాలో ఇంకా చాలా సీన్లు క‌ట్ చేయొచ్చు అనిపించింది. కొత్త నిర్మాత‌లు తుము ఫణి కుమార్, శ్రేయాస్ శ్రీనివాస్ నిర్మాణ విలువలు బాగున్నా.. క‌థ‌పై ఇంకాస్త దృష్టి పెట్టుంటే బాగుండేది అనిపించింది. 

చివ‌ర‌గా : ఇలాంటి క‌థ‌లకు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అయినా ఉండాలి.. న‌ట‌న‌తో క‌ట్టి ప‌డేసే ఆర్టిస్టులైనా ఉండాలి.. వెంక‌టాపురంకు ఈ రెండూ లేవు. దాంతో దారి తెలియ‌ని ప్ర‌యాణంలా మారిపోయింది ఈ వెంక‌టాపురం.

రేటింగ్  3/5

More Related Stories