వెబ్ సిరీస్ లో విక్టరీ వెంకటేష్..దర్శకుడు ఆయనే !



venky
2020-05-10 16:17:17

భవిషత్తులో సినిమాలు మాయం అవ్వచ్చని ? సినిమాల్ని వెబ్ సిరీస్ లు, ఇండిపెండెంట్ సినిమాలు రీప్లేస్ చేయచ్చనే వాదన వినిపిస్తోంది. ఈ వాదనకు తగ్గట్టే చాలా మంది స్టార్స్ ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాటిలో భాగం అవుతున్నారు. వెబ్‌ సిరీస్‌ లను కూడా సినిమాల స్థాయిలో సినిమా నటీనటులను, టెక్నీషియన్స్ ని పెట్టి మరీ తీస్తున్నారు. నిజానికి సినిమాలకు అయితే కొన్ని పరిమితులు, సెన్సార్‌ లాంటి కండీషన్స్‌ ఉంటాయి. వెబ్‌ సిరీస్‌ లకు అలాంటివి ఏమీ లేని కారణంగా చాలా మంది వెబ్‌ సిరీస్‌ లపై ఆసక్తి చూపుతున్నారు. బాలీవుడ్ కే పరిమితం అయిన ఈ సిరీస్ నెమ్మదిగా తెలుగులో కూడా విస్తరిస్తున్నాయి. తెలుగులో ఇప్పటికే క్రిష్ కొన్ని వెబ్ సిరీస్ తీయగా ఇప్పుడు ఏకంగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ సిరీస్ ల మీద ఇంటరెస్ట్ చూపిస్తున్నట్టు చెబుతున్నారు.

తాజాగా దర్శకుడు తేజతో కూడా ఆమెజాన్ ప్రైమ్ ఒక డీల్ కుదుర్చుచుకుందని ప్రచారం జరుగుతోంది. తేజను తమకు సినిమాలు చేసిపెట్టమని ఆమెజాన్ కోరిందట. రెండు సినిమాలు, మూడు వెబ్ సిరీస్ చేసిమ్మని ఆయనని కోరారట. ఆమెజాన్ తెలుగు కంటెంట్ మీద ఎక్కువ పెట్టుబడి పెట్టాలని చూస్తున్న క్రమంలో తేజను అప్రోచ్ అయినట్టు చెబుతున్నారు. ఇక హీరో వెంకటేష్ కూడా తేజ తెరకెక్కించే ఒక వెబ్ సిరీస్ లో నటించనున్నారని సమాచారం. దర్శకుడు తేజతో ఈ మేరకు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. అదే నిజమయితే OTT ప్లాట్ ఫార్మ్ లో స్టార్ హీరోల సందడి మొదలు అవడం ఖాయమని అంటున్నారు. 

More Related Stories