వేగంగా జరుగుతున్న దృశ్యం 2 షూటింగ్..



Venkatesh
2021-03-17 18:13:51

వెంకటేష్ ప్రధాన పాత్రలో మలయాళ దర్శకుడు జీతు జోసెఫ్ తెరకెక్కిస్తున్న సినిమా దృశ్యం 2. ఏడేళ్ల కింద వచ్చిన దృశ్యం సినిమాకు ఇది సీక్వెల్. మలయాళంలో సంచలన విజయం సాధించిన ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు జీతూ. ఇప్పటి వరకు తెలుగులో సీక్వెల్ కథలు హిట్ అయిన చరిత్ర లేదు. అయితే దృశ్యంతో ఈ బ్యాడ్ సెంటిమెంట్ బ్రేక్ చేస్తాను అంటున్నాడు వెంకటేష్. దానికి తగ్గట్లుగానే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుంది. ఇది కేవలం 40 రోజుల్లో సినిమా పూర్తి చేయాలని అని ఫిక్స్ అయిపోయాడు దర్శకుడు జోసెఫ్. దానికి తగ్గట్లుగానే షూటింగ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఒక షెడ్యూల్ అయిపోయింది. ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ ఇచ్చాడు వెంకటేష్. ఎఫ్ 3 సినిమాకు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి దృశ్యం ముందు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు వెంకటేష్. 

తాజా షెడ్యూల్ లో సీనియర్ హీరోయిన్ మీనా, ఎస్తర్ అనిల్, కృతిక కూడా జాయిన్ అయ్యారు. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం మిర్చి సంపత్ ని తీసుకున్నారు. ఏప్రిల్ లోపు షూటింగ్ పూర్తిచేసి జూన్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాకు సంబంధించిన లొకేషన్ స్టిల్స్ బయటకు వచ్చాయి. తొలి భాగం సాధించిన విజయంతో సీక్వెల్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో దృశ్యం 2 సినిమాను చాలా మంది చూశారు. ఈ కారణంతోటే సినిమాను త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దృశ్యంతో పాటు ఎఫ్ 3, నారప్ప సినిమాలతో బిజీగా వున్నాడు వెంకటేష్.
 

More Related Stories