హిట్స్ వచ్చాయి.. రేట్ పెంచేసిన వెంకటేష్..  Venkatesh
2020-04-01 17:33:14

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు సీనియర్ హీరోలకు అంతగా టైమ్ కలిసి రావడం లేదు. సాక్షాత్తు చిరంజీవి కూడా సైరాతో అన్ని వర్గాలను ఆకట్టుకోలేకపోయాడు. ఇక బాలయ్య, నాగార్జున కూడా చాలా రోజులుగా సరైన హిట్ కోసం చూస్తున్నారు. ఇలాంటి సమయంలో వెంకీ మాత్రం దూసుకుపోతున్నాడు. ఈయన ఇప్పుడు కూడా వరస విజయాలు అందుకుంటున్నాడు. గతేడాది ఈయన నటించిన ఎఫ్ 2తో పాటు వెంకీ మామ కూడా మంచి విజయం సాధించింది. ముఖ్యంగా ఎఫ్2 అయితే బ్లాక్ బస్టర్.. నిర్మాత దిల్ రాజుకు ఈయన కెరీర్ లోనే అత్యధిక లాభాలు తీసుకొచ్చిన సినిమా. ఇక వెంకీ మామ కూడా పర్లేదు అనిపించింది. దాంతో వెంకటేష్ మార్కెట్ పెరిగిపోయింది. ప్రస్తుతం ఈయన నారప్ప సినిమాలో నటిస్తున్నాడు. అసురన్ సినిమాకు రీమేక్ ఇది. 

ఈ సినిమాతో పాటు అనిల్ రావిపూడి ఎఫ్ 2 సీక్వెల్ గా ఎఫ్ 3 ప్లాన్ చేస్తుండగా వెంకటేష్ ఇందులో నటించడానికి ఏకంగా రెట్టింపు పారితోషికం అడుగుతున్నట్లు తెలుస్తుంది. గత రెండు సినిమాలు విజయం సాధించడంతో రేట్ పెంచేసాడని ప్రచారం జరుగుతుంది. ఎఫ్3 లో తను తప్ప మరో ఆప్షన్ లేదు కాబట్టి అంతగా డిమాండ్ చేస్తున్నాడని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి నిర్మాత దిల్ రాజు కూడా ఆలోచనలో పడిపోయాడు. ఈ సినిమా కోసం దాదాపు 11 కోట్ల వరకు వెంకీ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దానికి ముందు 7 కోట్ల వరకు ఈయన తీసుకునేవాడు. మరి చూడాలిక.. ఎఫ్3లో వెంకీ ఉంటాడో లేదో..? ఆయన లేకుండా సినిమా చేస్తే అసలుకే ప్రమాదం రావడం ఖాయం. దాంతో వెంకటేష్ ను కన్విన్స్ చేసే పనిలో పడ్డారు దర్శక నిర్మాతలు. 

More Related Stories